Citroen C3 Aircross | మార్కెట్లోకి సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్.. హ్యుండాయ్ క్రెటాతో టఫ్ ఫైట్.. !
Citroen C3 Aircross | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ‘సిట్రోన్ ఇండియా’.. దేశీయ మార్కెట్లోకి సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ ఆవిష్కరించింది. వచ్చేనెల 15 నుంచి డెలివరీ ప్రారంభిస్తారు.
Citroen C3 Aircross | ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోన్ ఇండియా (Citroen India) తన ఎస్యూవీ సీ3 ఎయిర్ క్రాస్ (C3 Aircross SUV) కారును ఆవిష్కరించింది. ఈ కారు ప్రీ బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతుంది. అయితే సీ3 ఎయిర్ క్రాస్ రేంజ్ అన్ని మోడల్స్ ధరలు వెల్లడించలేదు. సీ3 ఎయిర్ క్రాస్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. యూ, ప్లస్, మ్యాక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ మూడు వేరియంట్లు కూడా ఫైవ్/ సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్‌తో వస్తున్నాయి.
ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీల కోసం రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు. వచ్చేనెల 15 నుంచి డెలివరీ ప్రారంభిస్తామని సిట్రోన్ తెలిపింది.
సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ కారు 1.2 లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 109 బీహెచ్పీ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. అన్ని వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లోనే లభిస్తాయి. లీటర్ పెట్రోల్ పై 18.5 కి.మీ. మైలేజీ ఇస్తుంది. సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లీటర్ పెట్రోల్ మీద 17.5 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
10-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్ స్పీకర్స్ విత్ టూ ట్వీటర్స్, మాన్యువల్ ఏసీ, రూఫ్ మౌంటెడ్ రేర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్, టైర్ ప్రెషర్ మానిటర్, కీలెస్ ఎంట్రీ, రేర్ వైఫర్ విత్ వాషర్, రేర్ డీఫాగర్, మాన్యువల్ ఐఆర్వీఎం వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

