Evergrande | చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండేలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై చైనా సెంట్రల్ బ్యాంకు మౌనం వీడింది. ఆర్థిక సంక్షోభం నుంచి ఎవర్గ్రాండేను కాపాడవచ్చునని, ఇంతకుమించి పెరుగనివ్వబోమని తేల్చి చెప్పింది. మార్కెట్ ఓరియెంటెడ్, రూల్ ఆఫ్ లా ప్రిన్సిపుల్స్ ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలు ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తాయని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అధికారి జౌలాన్ శుక్రవారం తెలిపారు.
బ్యాంకర్లు స్థిరంగా, క్రమ పద్దతిలో రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలివ్వవచ్చునని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఫైనాన్సియల్ మార్కెట్ విభాగం హెడ్ జౌలాన్ చెప్పారు. ఎవర్గ్రాండేలో నగదు కొరతపై ఆందోళన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. రియాల్టీ రంగాన్ని బలోపేతం చేయడానికి కఠిన చర్యలు చేపట్టారు. ఎవర్‌గ్రాండే సంక్షోభం వెలుగు చూసిన తర్వాత.. గత రెండువారాలుగా ఫంటాసియా హోల్డింగ్స్ గ్రూప్, సినిక్ హోల్డింగ్స్ గ్రూప్స్ల డిఫాల్ట్ అనివార్యం అన్న చర్చ సాగుతోంది.