మధ్యస్ధాయి టెక్ కంపెనీల సీఈఓలకు బంపర్ బొనాంజా!

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ఈ ఏడాది మధ్యశ్రేణి ఐటీ కంపెనీల సీఈఓలకు తీపికబురు అందింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పందాల నేపథ్యంలో 2020-21లో ఈ ఐటీ కంపెనీల సీఈఓలు అత్యధిక వేతన పెంపును అందుకున్నారు. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సీఈఓ సంజయ్ జలోనాకు ఏడాదిలో వార్షిక వేతనం 29 శాతం వృద్ధి చెందింది. 2020-21లో కంపెనీ లాభాలు 27.5 శాతం పెరిగాయి. ఇక మైండ్‌ట్రీ సీఈఓ దేవాశిష్ ఛటర్జీ వార్షిక వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 131 శాతం పెరిగి రూ 11.3 కోట్లకు ఎగబాకింది.
ఇదే సమయంలో సంస్థ ఉద్యోగుల సగటు వేతన పెంపు 10 శాతంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనంలో ఎలాంటి మార్పు లేదని కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. మరోవైపు 2021 ఆర్థిక సంవత్సరంలో మైండ్‌ట్రీ లాభాలు ఏకంగా 76 శాతం ఎగబాకి రూ 1105 కోట్లకు చేరింది. ఇక పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అమెరికాకు చెందిన సందీప్ కల్రాను 153 శాతం వేతన పెంపుతో రూ 11.1 కోట్ల వేతన ప్యాకేజ్‌తో సంస్థ సీఈఓగా నియమించుకుంది. మరోవైపు మధ్యశ్రేణి ఐటీ కంపెనీల ఉద్యోగుల వేతనం మాత్రం సగటున పదిశాతం లోపు ఉండగా సీఈఓల వేతనాల్లో భారీ పెరుగుదల నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

