ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ షాక్.. 150 సంస్థల లైసెన్స్‌ను రద్దు చేసిన సెంట్రల్ బ్యాంక్
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రిజర్వుబ్యాంక్ గట్టి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందించడంలో విఫలంకావడంతో 150కి పైగా ఎన్బీఎఫ్సీ సంస్థల లైసెన్స్‌లను రద్దు చేసింది. సెక్షన్ 45-ఐఏ(6) రిజర్వుబ్యాంక్ చట్టం 1983 ప్రకారం ఆయా సంస్థలు బ్యాంకింగేతర ఆర్థిక సేవలు అందించకుండా నిషేధించింది.
న్యూఢిల్లీ, మే 16 : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రిజర్వుబ్యాంక్ గట్టి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందించడంలో విఫలంకావడంతో 150కి పైగా ఎన్బీఎఫ్సీ సంస్థల లైసెన్స్‌లను రద్దు చేసింది. సెక్షన్ 45-ఐఏ(6) రిజర్వుబ్యాంక్ చట్టం 1983 ప్రకారం ఆయా సంస్థలు బ్యాంకింగేతర ఆర్థిక సేవలు అందించకుండా నిషేధించింది. మరోవైపు, తమ లైసెన్స్‌లను తిరిగి అప్పగించిన మరో ఏడు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్లను కేంద్ర బ్యాంక్ రద్దు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు జైపూర్‌కు చెందిన ఒక ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించింది. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ 150 ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇక నుంచి నాన్ బ్యాంకింగ్ సేవలు అందించకూడదని తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ వెల్లడించింది.
బాధిత సంస్థల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో నమోదైనవి అయినప్పటికీ..వీటితోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అకిన్ విన్కామ్, అడ్మైర్ వినిమే, బ్లూ డైమండ్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్స్, తౌరస్ ఇస్పాత్ ప్రైవేట్‌తోపాటు ఢిల్లీకి చెందిన గోల్ సెక్యూరిటీస్ అండ్ క్రెడిట్, ఎండీ ఫిన్‌కాప్ ప్రైవేట్, పారస్ ఫిన్‌కాప్ సంస్థలు ఉన్నాయి. అలాగే లైసెన్స్‌ను సరెండ్ చేసిన ఏడు సంస్థల్లో అశోక వినియోగ, గురు కృప ఫిన్వెస్ట్ సంస్థలు కూడా ఉన్నాయి. మరోరెండు ఆర్ఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంజలి కాఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. వీటితోపాటు విలీనం రద్దుకావడంతో హెచ్డీఎఫ్సీ హోల్డింగ్‌స లిమిటెడ్ లైసెన్స్‌ను కూడా వెనక్కితీసుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

