సామాన్యుడికి వాహన యోగం దూరం : ఏప్రిల్ నుంచి బైక్‌లు, కార్ల ధరలకు రెక్కలు!
పెట్రో ధరల షాక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా కారు, బైక్‌ల ధరలకు రెక్కలు రానున్నాయి. ముడిపదార్ధాలు, మెటల్ ధరలు పెరగడంతో వాహన ధరలకు రెక్కలు రానున్నాయి.

న్యూఢిల్లీ : పెట్రో ధరల షాక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా కారు, బైక్‌ల ధరలు పెరగనుండటం మరింత భారం కానుంది. ఇంధన ధరలతో పాటు ముడిపదార్ధాలు, మెటల్ ధరలు పెరగడంతో వాహన ధరలకు రెక్కలు రానున్నాయి. ఆర్థిక వ్యవస్ధ క్రమంగా కొవిడ్-19కు ముందున్న పరిస్ధితికి చేరుకుంటుండటం కూడా వాహనాలకు డిమాండ్ పెంచుతోంది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో తమ వాహనాల ధరలను పెంచకతప్పడం లేదని వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలు పెరుగుతాయని దేశంలో అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రకటించింది.
ఏడాది కాలంగా ముడిపదార్ధాల ధరలు ఎగబాకడం కంపెనీ వాహనాల తయారీ వ్యయం పెరిగిందని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అదనపు వ్యయంలో కొంత భాగాన్ని ధరల పెంపు ద్వారా కస్టమర్లకు మళ్లిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ముడిపదార్ధాల ధరలతో పాటు పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో వాహనాలను కస్టమర్లకు చేర్చే సరఫరా వ్యయాలు పెరగడం కూడా ఆటోమొబైల్ కంపెనీలకు భారమైంది. ఇక ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ సైతం తమ వాహనాల ధరను పెంచేందుకు యోచిస్తోంది. ఏప్రిల్ నుంచి తమ బైక్‌లు, స్కూటర్ల ఎక్స్‌షోరూం ధరలు పెరుగుతాయని కంపెనీ గతంలో ప్రకటించింది.
ముడిపదార్ధాల ధరలు పెరగడంతో వాహనాల ధరలు పెంచకతప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలను పెరుగుతాయని ఆటోమేకర్ నిస్సాన్ ఇండియా మంగళవారం పేర్కొంది. ఆటో విడిభాగాల ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో అనివార్యంగా నిస్సాన్, డాట్సన్ మోడల్స్ అన్నింటిపై ధరల పెంపు చేపట్టక తప్పలేదని కంపెనీ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bike
- car
- Prices Hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

