Nirmala Sitaraman | పెట్టుబడుల ప్రోత్సాహానికే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గింపు.. ఆదాయం పన్ను విధానం సరళతరానికే ప్రాధాన్యం.. నిర్మల
Nirmala Sitaraman | పెట్టుబడుల ప్రోత్సాహానికే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పాత ఆదాయం పన్ను విధానంపై ఏ నిర్ణయం తీసుకోలేదని, అయితే పన్ను విధానం సరళీకృతమే తమ పాలసీ అని తెలిపారు.
Nirmala Sitaraman | పెట్టుబడులను ప్రోత్సహించడానికే పెట్టుబడి లాభాలపై పన్ను తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పాత ఆదాయం పన్ను విధానం రద్దుపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. 2021 నుంచి పాత ఆదాయం పన్ను విధానం బదులు కొత్త ఆదాయం పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంక్లిష్టంగా ఉన్న పాత ఆదాయం పన్ను విధానాన్ని సరళతరం చేయడానికే కొత్త ఆదాయం పన్ను విధానం తెచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సమీక్షించిన తర్వాత పాత ఆదాయం పన్ను విధానంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాత ఆదాయం పన్ను విధానంలో వేతన జీవులకు పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. కానీ, దాన్ని నిరుత్సాహ పరిచేందుకు కొత్త ఆదాయం పన్ను విధానంలో రూ.3 లక్షల వరకూ పన్ను చెల్లించనవసరం లేదు. తాజాగా స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. అయితే, ఆదాయం పన్ను విధానాన్ని సరళతరం చేయడమే తమ విధానం అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుల సమీకరణకు పన్నులు మాత్రమే కాదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నూతన రంగాల్లో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. యూపీఏ -2 హయాంలోనే ఏంజిల్ టాక్స్ తీసుకొచ్చారని ఆమె గుర్తుచేశారు. పారిశ్రామిక రంగం నుంచి సుదీర్ఘ కాలంగా వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో పూర్తిగా ఏంజిల్ టాక్స్ రద్దు చేసినట్లు వెల్లడించారు. చైనా సహా ఇరుగు పొరుగు దేశాల నుంచి పెట్టుబడులపై సమీక్ష జరుగుతున్నదని, ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం చేయలేదన్నారు. తన బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల కేటాయింపుల వివరాలను వెల్లడించలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల సాయం బహుళ రూపాల్లో ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

