కెనరా బ్యాంక్ లాభం 3,757 కోట్లు
కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,757 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,175 కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.28,807 కోట్లకు ఎగబాకింది.
- క్యూ4లో 18 శాతం పెరిగిన ప్రాఫిట్
న్యూఢిల్లీ, మే 8: కెనరా బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,757 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,175 కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.28,807 కోట్లకు ఎగబాకింది.
- రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.16.10 డివిడెండ్‌ను ప్రకటించింది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.35 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.73 శాతం నుంచి 1.27 శాతానికి తగ్గాయి.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.2,280 కోట్ల నిధులను వెచ్చించింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ రూ.14,554 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి స్థూల నిరర్థక ఆస్తుల విలువను 3.25 శాతానికి, నికర ఎన్‌పీఏను ఒక్క శాతానికి తగ్గిస్తాం. ఈ ఏడాది అడ్వాన్స్‌లు 11-12 శాతం, డిపాజిట్లలో 9 శాతం వృద్ధి నమోదు చేసుకోనున్నది. ప్రస్తుతం నిధులు సేకరించే ఆలోచనేది బ్యాంక్‌కు లేదని, బ్యాంక్ వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయి. అధిక వడ్డీరేట్ల కారణంగా ఈ ఏడాది నికర వడ్డీ మార్జిన్ 2.95-3 శాతంగా ఉండనున్నది. ఇప్పటి వరకు బ్యాంక్ రూ.1.10 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది.
– కే సత్యనారాయణ రాజు, కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

