Byju’s | సీఈవోని తొలగించాల్సిందే.. ఈజీఎంలో ఓటు చేసిన బైజూస్ షేర్హోల్డర్లు
Byju's | ముంబై, ఫిబ్రవరి 23: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని యాజమాన్య స్థానాల నుంచి, డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలంటూ ఆ సంస్థ వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు చేశారు.
Byju’s | ముంబై, ఫిబ్రవరి 23: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని యాజమాన్య స్థానాల నుంచి, డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలంటూ ఆ సంస్థ వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కంపెనీని నడుపుతున్న బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యుల్ని సాగనంపేందుకు కొంతమంది ఇన్వెస్టర్లు డిమాండ్ చేసిన అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం)శుక్రవారం జరిగింది. వారి తొలగింపునకు ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా ఇందుల్లో పాల్గొన్న షేర్హోల్డర్లందరూ ఓటు చేశారు.
ఈజీఎంకు పిలుపునిచ్చిన ఇన్వెస్టింగ్ సంస్థలకు బైజూస్‌లో 32 శాతంపైగా వాటా ఉంది. ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ సతీమణి చాన్ జుకర్‌బర్గ్‌తో సహా కొన్ని విదేశీ ఫండ్స్ ప్రస్తుత యాజమాన్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులకు బైజూస్ ప్రమోటింగ్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 26.3 శాతం వాటా ఉంది.ఈజీఎంను నిలుపుచేయాలని రెండు రోజుల క్రితం బైజూస్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, అందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈజీఎంలో ఆమోదించిన ఎటువంటి తీర్మానాన్ని అయినా తదుపరి విచారణలోగా అమలు చేయరాదని కర్నాటక హైకోర్టు ఆదేశించినందున, మార్చి 13 వరకూ ఈ తీర్మానం అమలుకాదు. యాజమాన్యాన్ని తొలగించాలన్న తీర్మానమే కాకుండా మరో ఆరు తీర్మానాలకు అనుకూలంగా మెజారిటీ షేర్హోల్డర్లు ఓటు చేశారు. బోర్డును పునర్వ్యవస్థీకరించడం, యాజమాన్యాన్ని మార్చడం, కంపెనీ చేసిన టేకోవర్లపై థర్డ్ పార్టీతో ఫోరెన్సిక్ దర్యాప్తు జరిపించడం వంటివి ఈ తీర్మానాల్లో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఓటింగ్ చెల్లదు: కంపెనీ
థింక్ అండ్ టెర్న్ బోర్డులో వ్యవస్థాపక సీఈవో రవీంద్రనాథ్ బైజూ, ఆయన భార్య, సొదరుడు..ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరంతా ఈజీఎంకు హాజరుకాలేదు. వ్యవస్థాపకులు హాజరుకాని ఈ సమావేశంలో ఆమోదించిన ఓటు చెల్లనేరదని, పనికిరాదని కంపెనీ ప్రకటించింది. ఈజీఎం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకాగా, కొంతమంది బైజూస్ ఉద్యోగులతో సహా 200 మంది వర్చువల్ సమావేశంలో పాల్గొంటామని రావడంతో ఒక గంటపాటు జాప్యం జరిగింది. ఇన్వెస్టర్లను పూర్తిగా వెరీఫై చేసిన తర్వాత ఇన్వెస్టర్ల ప్రతినిధులైన 40 మందినే సమావేశంలోకి అనుమతించారు. బైజూస్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏవోఏ)లో ఆర్టికల్స్ 38, 39 (ఏ) ప్రకారం తీర్మానాలు ఆమో దం పొందాలంటే కనీసం ఒక వ్యవస్థాపక డైరెక్టరు హాజరుకావాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. సమావేశంలో వ్యవస్థాపకులెవరూ పాల్గొనని కారణంగా తీర్మానాలన్నీ చెల్లవని తెలిపింది.అలాగే పక్షపాతంతో ఏర్పాటైన ఈజీఎంలో మొత్తం షేర్హోల్డర్లలో 20 శాతం మందే పాల్గొన్నారని కంపెనీ ఆరోపించింది. కానీ కంపెనీ షేర్‌హోల్డర్ల సంఖ్యను ప్రస్తావించింది తప్ప వారికి ఉన్న వాటాల శాతాన్ని చెప్పకపోవడం గమనార్హం.
ఎన్సీఎల్టీలో పిటిషన్
ప్రస్తుత యాజమాన్యాన్ని మొత్తం ఆరుగురు ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండగా, అందులో నలుగురు ఈజీఎంకు ముందు రోజునే బైజూస్ యాజమాన్య దుర్వినియోగంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంగుళూరు బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీని నడపడానికి సీఈవో బైజు రవీంద్రన్తో కుటుంబ సభ్యులు కంపెనీని నడపడానికి అనర్హులుగా ప్రకటించాలని, కొత్త బోర్డును నియమించాలని, అకౌంట్స్ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించాలని ఎన్సీఎల్టీని విన్నవించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

