పీపీఎఫ్తో కరోడ్‌పతి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో నిర్దిష్ట రీతిలో పెట్టుబడులు పెట్టి, పూర్తి కాలవ్యవధి ఆగితే కోటి రూపాయలకుపైగానే అందుకోవచ్చు. పీపీఎఫ్.. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కావడంతో ఇదో సురక్షిత పెట్టుబడి. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆనందదాయక జీవితాన్ని ఆస్వాదించేందుకు ఇది చక్కని మార్గం కూడా.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో నిర్దిష్ట రీతిలో పెట్టుబడులు పెట్టి, పూర్తి కాలవ్యవధి ఆగితే కోటి రూపాయలకుపైగానే అందుకోవచ్చు. పీపీఎఫ్.. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కావడంతో ఇదో సురక్షిత పెట్టుబడి. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆనందదాయక జీవితాన్ని ఆస్వాదించేందుకు ఇది చక్కని మార్గం కూడా. పిల్లల చదువు, వివాహాలు తదితర లక్ష్యాల సాధనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీనిపై ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను 7.1 శాతం వడ్డీరేటున్నది. దీన్నిబట్టి ఈ పథకంలో గరిష్ఠ స్థాయి పెట్టుబడులు పెడితే కాలపరిమితి తీరాక కోటీశ్వరులమే.
ఇదీ లెక్క
పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ 15 ఏండ్లు. ఇందులో ఏటా గరిష్ఠంగా రూ.1.5 లక్షల పెట్టుబడి పెడితే 15 ఏండ్లకు రూ.22.5 లక్షలు అవుతుంది. దీనికి 7.1 శాతం వడ్డీ ప్రయోజనాన్ని జతచేస్తే ఆ మొత్తం రూ.40,68,209 అవుతుంది. వడ్డీ వాటానే రూ.18,18,209. ఇక మీ పీపీఎఫ్ ఖాతాను నిర్ణీత కాలపరిమితి తీరాక ఐదేండ్ల చొప్పున రెండుసార్లు అంటే 10 సంవత్సరాలు పొడిగించుకుంటే మొత్తం 25 ఏండ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి రూ.1,03,08,014. 97 అవుతుంది. ఒకవేళ మరో ఐదేండ్లు దీన్ని ఆపితే అది రూ.1,54,50,910.59కి చేరుతుంది. కాగా, పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. రూ.50కి తగ్గకుండా ఎన్నిసాైర్లెనా డిపాజిట్లు చేయవచ్చు. డిపాజిట్లకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద ప్రయోజనాలుంటాయి. అలాగే వడ్డీ ఆదాయానికీ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

