ఎం-క్యాప్ పెరుగుదలలో టీసీఎస్& ఇన్ఫోసిస్ లబ్ధి!
ఎం-క్యాప్ పెరుగుదలలో టీసీఎస్& ఇన్ఫోసిస్ లబ్ధి!| దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప లాభాలు గడించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్..

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్పంగా లాభాలు గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లోని లిస్టెడ్ కంపెనీల్లో టాప్-5 కంపెనీలు రూ.1.01 లక్షల కోట్ల మేరకు లాభ పడ్డాయి. వీటిల్లో దేశీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ 374.71 (0.71%) పాయింట్లు లాభ పడింది.
టీసీఎస్ ఎం-క్యాప్ ఇలా రూ.47,551 కోట్లు పెరుగుదల
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.47,551.31 కోట్లు పెరిగింది. దీంతో కంపెనీ ఎం-క్యాప్ రూ.12 లక్షల కోట్లు దాటి, రూ.12.10 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈ టాప్ గెయినర్లలో టీసీఎస్ అత్యధికంగా లబ్ధి పొందింది.
మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ కూడా రూ.26,227.28 కోట్లు పెరిగి రూ.6.16 లక్షల కోట్లకు పెరిగింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,200.35 కోట్లు పెరిగి, రూ.14.02 లక్షల కోట్లకు చేరుకున్నది.
రూ. 5.5 లక్షల కోట్లు దాటిన హెచ్‌యూఎల్ ఎం-క్యాప్
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,850.48 కోట్లు పెరిగి రూ.5.56 లక్షల కోట్లను దాటింది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.7,560.02 కోట్లు పెంచుకుంది. ప్రస్తుతం దాని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.69 లక్షల కోట్లకు చేరింది.
ఇలా తగ్గిన హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్
ఇక హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,968.39 కోట్లు తగ్గింది. దీంతో ఈ సంస్థ మొత్తం ఎం-క్యాప్ రూ.4,61,972.21 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,249.47 కోట్లు పతనమై రూ.8.20 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
పతనం బాటలోనే ఐసీఐసీఐ తదితర స్క్రిప్ట్‌లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ సైతం రూ.4,927.52 కోట్లు తగ్గి రూ.4.40 లక్షల కోట్లకు దిగి వచ్చింది. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,614.47 కోట్లు తగ్గి రూ.3.83 లక్షల కోట్లకు చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎం-క్యాప్ రూ.2,924.02 కోట్లు పతనమై రూ.3.55 లక్షల కోట్లకు పరిమితమైంది.
టాప్‌లోనే రిలయన్స్
మార్కెట్ క్యాపిటలైజేషన్లో బీఎస్ఈ-10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

