Brent Crude oil | అమెరికా ముడి చమురు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర బ్రిటన్లో 85 డాలర్లు దాటింది. 2018 తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. గ్లోబల్ ఎనర్జీలో ఇది తాజా మైలురాయి. విద్యుత్ మార్కెట్ కోసం బొగ్గు, సహజవాయువు కోసం అదనపు డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో శుక్రవారం ఇంట్రాట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఈ స్థాయికి పెరిగింది. బ్రెంట్ క్రూడ్ వరుసగా ఆరోవారం లాభాలు పొందింది. మరోవైపు అధిక క్రూడ్ కొనుగోలు చేయడానికి ప్రైవేట్ రిఫైనరీలకు చైనా అనుమతి ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా కరంట్ కొరత దూసుకొస్తున్నది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ధర 500 రెట్లు పెరిగాయి. గతనెలతో పోలిస్తే 130 శాతం పెరిగాయి. దీంతో యూరప్ దేశాల్లో ఫర్టిలైజర్స్ ఉత్పత్తిలో కోత విధించాయి. మరోవైపు ఆసియా దేశాలు రికార్డుస్థాయిలో డబ్బు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.