Bank of Baroda | తొలి త్రైమాసికంలో కళ్లు చెదిరే లాభాలు ఆర్జించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
Bank of Baroda | ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.4,070 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు బీవోబీ ఎండీ, సీఈవో దేబదత్త చంద్ తెలిపారు.
Bank of Baroda | ముంబై, ఆగస్టు 5: ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.4,070 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు బీవోబీ ఎండీ, సీఈవో దేబదత్త చంద్ తెలిపారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,168.1 కోట్లతో పోలిస్తే 88 శాతం పెరిగింది. కానీ, జనవరి-మార్చి మధ్యకాలంలో నమోదైన రూ.4,775 కోట్ల లాభంతో పోలిస్తే భారీగా తగ్గింది. మార్కెట్ వర్గాలు అంచనావేసిన స్థాయిలో నమోదు చేసుకోలేదు.
- నికర వడ్డీ ఆదాయం 24.4 శాతం పెరిగి రూ.10,997 కోట్లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇది రూ.8,848 కోట్లుగా ఉన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నమోదైన రూ.11,525 కోట్ల కంటే ఇది తక్కువ.
- నికర వడ్డీ మార్జిన్ 3.02 శాతం నుంచి 3.27 శాతానికి చేరుకున్నది.
- వడ్డీయేతర ఆదాయం మూడింతలు పెరిగి రూ.3,322 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ కేటాయింపులు రూ.1,560 కోట్ల నుంచి రూ.1,946 కోట్లకు పెరిగాయి.
- గత త్రైమాసికంలో రూ.1,937 కోట్ల మొండిబకాయిలు, రూ.636 కోట్ల రద్దు చేసిన రుణాలు వసూలయ్యాయి.
- డిపాజిట్లు 3.46 శాతం నుంచి 4.68 శాతానికి చేరుకోగా, ఆదాయ రేషియో 54.81 శాతం నుంచి 45.36 శాతానికి దిగొచ్చింది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.51 శాతానికి(రూ.34,832 కోట్లు), నికర ఎన్పీఏ 1.58 శాతం నుంచి 0.78 శాతానికి దిగొచ్చాయి.
- రిటైల్ రుణాలు 24.8 శాతం, వాహన రుణాలు 22.1 శాతం, గృహ రుణాలు 18.4 శాతం, వ్యక్తిగత రుణాలు 82.9 శాతం, మార్ట్గేజ్ రుణాలు 15.8 శాతం, విద్యా రుణాలు 20.8 శాతం చొప్పున పెరిగాయి.
- వ్యవసాయ రుణాలు 18 శాతం పెరిగి రూ.1,27,583 కోట్లకు, బంగారం రుణాలు 32 శాతం అధికమై రూ.40,652 కోట్లకు
చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

