BOB-HPCL Credit Card | హెచ్‌పీసీఎల్ ప్లస్ బీవోబీ రూపే క్రెడిట్ కార్డు..ఇవీ బెనిఫిట్లు!
BOB-HPCL Credit Card | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి హెచ్‌పీసీఎల్, బీవోబీ కోబ్రాండ్ క్రెడిట్ కార్డు తెస్తున్నాయి.
BOB-HPCL Credit Card | పెట్రోల్ ధరలు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఇటీవల ఎక్సైజ్ సుంకం తగ్గించినా.. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109 పలుకుతోంది. అత్తెసరు వేతనాలతో బతికే ఉద్యోగులకు కుటుంబాల నిర్వహణ కత్తిమీద సామే. అయితే, పొదుపు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వివిధ బ్యాంకులు.. కేంద్ర చమురు సంస్థలతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోబీ) కలిసింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోబీ) అనుబంధ బీవోబీ ఫైనాన్సియల్ సొల్యూషన్స్ (బీఎఫ్ఎస్ఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) కో బ్రాండెండ్ కాంటాక్ట్ లెన్స్ రూపే క్రెడిట్ కార్డు ప్రారంభిస్తున్నట్లు తెలిపాయి. హెచ్‌పీసీఎల్ బీవోబీ కోబ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డుగా పిలుస్తారు.
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేసన్ (హెచ్‌పీసీఎల్) పెట్రోల్ పంపుల వద్ద హెచ్‌పీ పే యాప్ ద్వారా హెచ్‌పీసీఎల్ బీవోబీ రూపే క్రెడిట్ కార్డు వాడిన వారికి రివార్డ్ పాయింట్లు వస్తాయి. యుటిలిటీస్, గ్రాసరీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో వాడినా ఆఫర్లు ఇస్తాయి. జేసీబీ నెట్వర్క్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటీఎంల వద్ద ఈ కార్డు వాడుకోవచ్చు.
హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంంకు వద్ద హెచ్‌పీ పే యాప్ ద్వారా హెచ్‌పీసీఎల్ బీవోబీ రూపే కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డుపై వాడే రూ.150లకు 24 రివార్డు పాయింట్లు వస్తాయి. అదనంగా ఒకశాతం ఫ్యూయల్ సర్‌చార్జి కూడా రాయితీ ఇస్తారు. 60 రోజుల్ల్లో రూ.5000 లేదా అంతకంటే ఎక్కువ వాడితే 2000 బోనస్ రివార్డు పాయింట్లు లభిస్తాయి.
యుటిలిటీస్, గ్రాసరీ, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రతి రూ.150 ఖర్చుపై 10 రివార్డు పాయింట్లు, ఇతర క్యాటగిరీల్లో రెండు రివార్డు పాయింట్లు పొందొచ్చు. సినిమా టికెట్ల బుకింగ్‌పై ఆకర్షణీయ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ కార్డు గల వారు ఏటా నాలుగుసార్లు దేశీయ విమానాశ్రయ లాంజ్‌లను నాలుగుసార్లు ఉచితంగా సందర్శించొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

