Bitcoin | క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా పతనం.. 12 శాతం పడిపోయి 65,000 డాలర్ల దిగువకు
Bitcoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్ కాయిన్ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. ఒకే రోజు దాదాపు 12 శాతం పడిపోయి, 65,000 డాలర్ల దిగువకు చేరింది.
Bitcoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్ కాయిన్ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. ఒకే రోజు దాదాపు 12 శాతం పడిపోయి, 65,000 డాలర్ల దిగువకు చేరింది. ఏడాది కాలంగా ఇదే అత్యల్ప స్థాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఇదే మొదటిసారి. క్రిప్టో మార్కెట్లో భయాందోళనల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడుల మూలంగా బిట్ కాయిన్ విలువ పడిపోయినట్లు అంచనా.
కొద్దిసేపటిక్రితం బిట్ కాయిన్ విలువ 64,352.40 డాలర్ల వద్ద ఉండగా, ఏడాది విలువ ప్రకారం 33.82 శాతం తగ్గింది. 24 గంటల్లో 9.84 శాతం పడిపోయింది. 1 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయిన్లను ఇన్వెస్టర్లు వదులుకున్నారు. గత ఏడాది అక్టోబర్లో బిట్ కాయిన్ విలువ అత్యధికంగా 1,26,000 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం బిట్ కాయిన్ మార్కెట్ మొత్తం విలువ 1.28 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 24 గంటల్లో విలువ తగ్గి 143.98 బిలియన్ డాలర్లకు చేరింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 58.2 శాతం ఉంది. తర్వాత రెండో స్థానంలో ఎథేరియం 10.4 శాతం, మిగతా వాటి వాట 31.5 శాతంగా ఉంది.
టెథర్ ధర స్థిరంగా 0.9988 డాలర్ల వద్ద ఉండగా, బైనాన్స్ కాయిన్ ధర 619 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్పి ధర 1.27 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, సోలానా 68 డాలర్ల దిగువకు, డాగ్కాయిన్ 0.09 డాలర్ల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని, సపోర్ట్ లెవల్స్ దగ్గర బాగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

