Bill Gates | లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్.. పౌలా హర్డ్‌తో డేటింగ్ నిజమేనట..!
అపర కుబేరుడైన వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. 60 ఏళ్ల పౌలా హర్డ్‌తో బిల్‌గేట్స్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Bill Gates | అపర కుబేరుడైన వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. 60 ఏళ్ల పౌలా హర్డ్‌తో బిల్‌గేట్స్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం..
బిల్‌గేట్స్, పౌలా హర్డ్ ఏడాదిగా రిలేషన్లో ఉన్నట్లు సదరు పత్రిక వెల్లడించింది. గత నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు కూడా. బిల్ గేట్స్-పౌలా రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారని.. వారిది విడదీయలేని బంధం అని వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపారు.
టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్యనే ఈ పౌలా హర్డ్. క్యాన్సర్‌తో చాలాకాలం పోరాడిన మార్క్ 2019లో మరణించారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారట.
దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు బిల్ గేట్స్-మెలిందా దంపతులు. ఈ ఇద్దరూ 1994లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమోకానీ పెళ్లైన 27 ఏళ్ల తరువాత విడిపోయారు. టాక్స్ ఎగ్గొట్టడం కోసమే విడాకులు తీసుకున్నారంటూ వీళ్లు విడిపోయినపుడు రకరకాల రూమర్స్ వచ్చాయి. విడాకుల అనంతరం మెలిందా ప్రేమలో పడ్డట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీ(Jon Du Pre)తో డేటింగ్ చేస్తున్నట్టు ఒక ఆన్లైన్ టాబ్లాయిడ్ రిపోర్టు చేసింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్టు పేర్కొంది. కాగా, బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను భరించలేని వేదనకు గురైనట్టు మెలిందా గేట్స్ ఇటీవల ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

