Bank Employes | పెరగనున్న బ్యాంకు ఉద్యోగుల వేతనాలు.. శనివారాలన్నీ సెలవే..!
Bank Employees | బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17 శాతం పెరగనున్నాయి. ఐదు రోజుల పని విధానంపై ఇండియన్ బ్యాంకుల సంఘం (ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరిందని తెలుస్తున్నది.
Bank Employes | కేంద్ర ప్రభుత్వోద్యోగులు, సాఫ్ట్ వేర్ రంగ ఉద్యోగుల మాదిరిగానే బ్యాంకింగ్ ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు త్వరలో అమలులోకి రానున్నాయి. మరోవైపు, బ్యాంకు ఉద్యోగుల వేతనం పెంచడానికి బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య అంగీకారం కుదిరింది.
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెంచడానికి, ఉద్యోగ సంఘాలు, ఐబీఏ మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తున్నది. 2022 నవంబర్ నుంచి బ్యాంకు ఉద్యోగులకు వేతనాలు పెరుగనున్నాయి. దీనివల్ల సుమారు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూ.8,284 కోట్ల భారం పడుతుందని తెలుస్తున్నది.
ఇక ప్రతి నెలలో అన్ని శనివారాలను సెలవు దినంగా గుర్తించడానికి ఉమ్మడి అంగీకారం కుదిరిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నది. ఈ విషయమై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేశాక కొత్త పని వేళలు అమలులోకి వస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

