Maruti Big Discounts | మారుతి కార్లపై డిస్కౌంట్లు.. ఆ రెండింటిపైనే గరిష్టం..!
Maruti Big Discounts |
Maruti Big Discounts | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. కస్టమర్ల ఆకాంక్షలు అభిరుచులను తెలుసుకుని కార్లను డిజైన్ చేయడంలో ముందు వరుసలో నిలుస్తుంది. సేఫ్టీ పరంగా అత్యాధునిక కార్ల తయారీలోనూ.. కొనుగోలుదారులకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడంలోనూ ముందు వరుసలోనే నిలుస్తుంది. ఒకవైపు రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు అమలుతో కార్ల తయారీ ఖర్చు పెరిగినా డిస్కౌంట్లు ప్రకటించింది. జూన్ నెలాఖరు వరకు వివిధ మోడల్ కార్లపై గరిష్టంగా రూ.61 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నది. ఆ వివరాలేమిటో ఓ లుక్కేద్దామా.. !
వ్యాగన్-ఆర్ పై రూ.61 వేల డిస్కౌంట్

మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ కారు వ్యాగన్-ఆర్ మీద గరిష్ట డిస్కౌంట్ అందిస్తున్నది. పెట్రోల్ వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ.25,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000తోపాటు ఇతర రూపాల్లో డిస్కౌంట్ అందిస్తున్నది. వ్యాగన్-ఆర్ వీఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ సీఎన్జీ వేరియంట్లపై రూ.57,100 డిస్కౌంట్ ప్రకటించింది.

అదే దారిలో ఎస్-ప్రెస్సో
ఎస్-ప్రెస్సో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపైనా గరిష్టంగా రూ.61 వేల డిస్కౌంట్ ఇస్తున్నది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లపై రూ.32 వేలు, ఎస్-ప్రెస్సో సీఎన్జీ వేరియంట్లపై రూ.52,000 డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

సెలెరియోపై డిస్కౌంట్ ఇలా
సెలెరియో మాన్యువల్ గేర్ బాక్స్ పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ.61 వేల విలువైన డిస్కౌంట్లు అందిస్తున్నది. పెట్రోల్ ఏఎంటీ వేరియంట్లపై గరిష్టంగా రూ.31 వేలు, సీఎన్జీ వేరియంట్లపై రూ.57 వేల వరకు రాయితీ ప్రకటించింది.

ఆల్టో కే10పై రూ.57 వేల వరకు రాయితీ
పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్లపై రూ.57 వేలు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ (ఎఎంటీ) వేరియంట్లపై రూ.32 వేల రాయితీ అందిస్తున్నది. సీఎన్జీ వేరియంట్ మీద రూ.47 వేల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

స్విఫ్ట్ మీద రూ.52 వేలు
స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యధికంగా రూ.52 వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్లపై రూ.47 వేల రాయితీ ఇస్తున్నది. పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్లపై రూ.52 వేలు, సీఎన్జీ వేరియంట్లపై రూ.18,100 డిస్కౌంట్ లభిస్తుంది.

ఎకో పై రూ.39 వేల డిస్కౌంట్
మారుతి సుజుకి ఎకో 1.2 లీటర్ల కే-సిరీస్ ఇంజిన్ పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా 39,000 డిస్కౌంట్ ఇస్తున్నది. సీఎన్జీ పవర్డ్ వేరియంట్ మీద రూ.37,100 రాయితీ అందిస్తున్నది.

ఆల్టో 800పై రూ.35 వేల వరకు రాయితీ
మారుతి సుజుకి ఆల్టో800 నిల్వ కార్లపై గరిష్టంగా రూ.35 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. బేస్ వేరియంట్ కారుకు మినహాయింపు ఉంది. సీఎన్జీ వేరియంట్ ఆల్టో 800 కారుపై కూడా రూ.35 వేల రాయితీ లభిస్తుంది.

డిజైర్‌పై డిస్కౌంట్లు ఇలా
మారుతి సుజుకి కంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మీద రూ.17 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 90 హెచ్‌పీ విద్యుత్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ కార్లపై డిస్కౌంట్లు లేవు. నగరాల వారీగా డిస్కౌంట్లలో తేడా ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

