Credit Card | క్రెడిట్ కార్డు బిల్లు భారం కావద్దంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి..!
Credit Card | క్రెడిట్ కార్డుల యూజర్లు తమ కెపాసిటీని బట్టి వాడటంతోపాటు ప్రతి నెలా బిల్లు పే చేయాలి. లేదంటే బకాయిలతో అప్పుల ఊబిలో చిక్కుకుంటారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Credit Card | గతంలో క్రెడిట్ కార్డు పొందాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది.. బ్యాంకు ఖాతాలో డిపాజిట్లు.. లావాదేవీల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలి.. ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లకు తేలిగ్గా క్రెడిట్ కార్డులు లభించేవి. కానీ ఇప్పుడు ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నది. తేలిగ్గా క్రెడిట్ కార్డు ఇవ్వడంతోపాటు పలు బెనిఫిట్లు అందిస్తున్నది.
ప్రతి ఒక్కరూ ప్రస్తుతం రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులను వాడేస్తున్నారు. ఆయా క్రెడిట్ కార్డుల బిల్లులు కూడా బకాయిలు పెరుగుతున్నాయి. గత ఏప్రిల్ నాటికి క్రెడిట్ కార్డు బకాయిలు రూ.2 లక్షల కోట్లు దాటాయి. క్రెడిట్ కార్డు యూజర్లు ప్రతి నెలా కనీస మొత్తం బిల్లు మాత్రమే చెల్లించడం వల్లే బకాయిలు పెరిగిపోతున్నాయి. ఇదిలా సాగితే పెద్దమొత్తంలో పెనాల్టీ, వడ్డీ కూడా చెల్లించాలి. తద్వారా అప్పుల ఊబిలో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
కనుక క్రెడిట్ కార్డుల వాడకంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు గడువు వడ్డీ రహిత కాలం. ఏ కొనుగోళ్లు చేసినా 50 రోజుల వరకు ఏ వడ్డీ లేకుండా పేమెంట్ చేసేయొచ్చు. ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా.. కనీస మొత్తం బిల్లు చెల్లించి.. మిగతా బిల్లు తదుపరి నెలలో చెల్లించొచ్చు. ఇది ఉపయోగమైనా.. అలా బకాయిలు పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డు యూజర్లు అప్పుల్లో కూరుకుపోతున్నారు. కనుక క్రెడిట్ కార్డు యూజర్లు ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు యూజర్లలో అత్యధికులు తమ కొనుగోలు శక్తి కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. గడువు ముగిసే సమయానికి బిల్లు చెల్లించలేక చేతులెత్తేస్తుంటారు. కనీస బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ఇలా వ్యవహరించడం ఎంత మాత్రం సరి కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గడువు లోపు కనీస బిల్లు పే చేస్తే సరి.. లేదంటే ఫైన్ చెల్లించాలి. బకాయిపై దాదాపు 20-44 శాతం వడ్డీ చెల్లించాలి.
కనీస మొత్తం బిల్లు చెల్లిస్తే ఆలస్య చెల్లింపు చార్జీలు తప్పించుకోవచ్చు. కనీసమొత్తం చెల్లించినా.. మరుసటి బిల్లింగ్ నాటికి జరిపే కొనుగోళ్లపై వడ్డీ భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తద్వారా క్రెడిట్ కార్డుతో లభించే ప్రయోజనాలు కోల్పోవడంతోపాటు.. ఆ బిల్లులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది.
కనుక అదనపు చార్జీలు.. వడ్డీ భారం పడకుండా క్రెడిట్ కార్డు వాడకంలో చిట్కాలు పాటించాలని నిపుణులు అంటున్నారు. తమ పేమెంట్ కెపాసిటీని బట్టి క్రెడిట్ కార్డు వాడాలి. ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఆయా బిల్లుల మొత్తం ఈఎంఐగా మార్చుకోవడం బెటర్. ఈఎంఐగా మార్చుకోవడం వల్ల వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు ఉన్నా.. బకాయిపై వడ్డీతో పోలిస్తే తక్కువ.
క్రెడిట్ లిమిట్ మొత్తం వినియోగిస్తే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. కనుక క్రెడిట్ లిమిట్ లో 30 శాతం లోపే ఖర్చు చేయాలి. ఈ చిట్కా అర్థమైన క్రెడిట్ కార్డు యూజర్లు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు.
ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగిన క్రెడిట్ కార్డులను ఎంచుకోవడంతో వల్ల ఎక్కువ బెనిఫిట్లు పొందొచ్చు. ఆన్ లైన్ షాపింగ్, ట్రావెల్ కార్డులను ఎంపిక చేసుకోవడంతో ఎంతో కొంత మొత్తం ఆదా చేసుకోగలుగుతారు. క్రెడిట్ కార్డుతో పొరపాటున కూడా మనీ విత్ డ్రాయల్ చేయడానికి ప్రయత్నించొద్దు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు అందుకోవాలంటే వాటి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడం బెటర్ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

