Best Selling Cars | కరోనాకు ముందుతో పోలిస్తే.. తర్వాతీ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధ్యమైనంత మేరకు స్పేసియస్గా, ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే ఎస్యూవీ కార్ల కొనుగోళ్లకు మొగ్గుతున్నారు. గతేడాది 2022లో అమెరికన్లు ఫోర్డ్ ఎఫ్ సిరీస్ ఎస్ యూవీ కార్లపై మోజు పెంచుకున్నా.. తర్వాత ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా మన మారుతి వ్యాగన్-ఆర్ నిలిచింది. భారత్ మొదలు అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ దేశాల్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల వివరాలు తెలుసుకుందామా.. !
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.. ఎఫ్ సిరీస్ కార్లపై అమెరికన్లు మనస్సు పారేసుకున్నారు. 2022లో అత్యధికంగా ఫోర్డ్ ‘ఎఫ్’ సిరీస్ కార్లు సొంతం చేసుకున్నారు. 2021తో పోలిస్తే గతేడాది (2022)లో 9,08,921 కార్లు అమ్ముడయ్యాయి. 2021లో 8,94,757 కార్లు సేల్ అయ్యాయి. 2022లో ఎస్యూవీ కార్లు 8,61,256 అమ్ముడు పోయాయి.
చైనాలో గతేడాది అత్యధికంగా బీవైడీ సాంగ్ ప్లస్ కార్లు అమ్ముడు పోయాయి. 2022లో చైనాలో 4,59,424 బీవైడీ సాంగ్ ప్లస్ కార్లు అమ్ముడయ్యాయి.
భారత్ మార్కెట్లో పేరొందిన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ వేరియంట్ కారు 2022లో అత్యధికంగా సేల్ అయ్యింది. గతేడాది 2,17,217 యూనిట్లు విక్రయించింది.
జర్మనీలో గతేడాది సేల్ అయిన కార్లలో ఫోక్స్ వ్యాగన్ గోల్ఫ్ నిలిచింది. 2022లో జర్మనీలో గరిష్టంగా 84,282 కార్లు విక్రయించింది ఫోక్స్ వ్యాగన్. బ్రిటన్లో నిసాన్ కంపెనీకి చెందిన ఖ్వాష్ ఖాయి మోడల్ కారు 2022లో అత్యధికంగా 42,704 కార్లు విక్రయించింది.