Amaze-Dzire | ఫస్ట్ టైం కారు కొనాలంటే.. హోండా అమేజ్.. మారుతి డిజైర్ బెస్ట్.. ఎందుకంటే?!
Amaze-Dzire | ఫస్ట్ టైం కార్ల కొనుగోలుదారులకు హోండా అమేజ్, మారుతి సుజుకి డిజైర్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.
Amaze-Dzire | ఫస్ట్ టైం కారు కొనుగోలు చేసేవారికి సేఫ్టీ.. పెట్రోల్ మైలేజీ, పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన వెహికల్ చాయిస్ ఉంటాయి. ఏబీఎస్, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేప్టీ ఫీచర్స్ తప్పనిసరి కోరుకుంటారు. రన్నింగ్ కాస్ట్ తగ్గించేలా శక్తిమంతమైన ఇంజిన్, మంచి మైలేజీకి ప్రాధాన్యం ఇస్తారు. ఫస్ట్ టైం కంపాక్ట్ సెడాన్ కారు కొనుగోలు దారులు యూజర్ ఫ్రెండ్లీ డ్రైవర్ అసిస్టెన్స్, పవర్ స్టీరింగ్, పార్కింగ్ సెన్సర్లు, పవర్ విండోస్ వంటి కన్వీనెస్స్ ఫీచర్లు, అందుబాటు ధర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఫస్ట్ టైం కార్ల కొనుగోలు దారులకు హోండా కార్స్ అమేజ్, మారుతి డిజైర్ సెడాన్ కార్లు పాపులర్. ప్రత్యేకించి కారు నడుపుతున్నప్పుడు నూతన డ్రైవర్లకు మనశ్శాంతిగా ఉండాలంటే బ్రాండ్ రిప్యూటేషన్తోపాటు ఏబీఎస్, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు.. ఈ రెండు కార్లలో తప్పనిసరి అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు కార్లు స్ఫూర్తిమంతమైన ఫ్యుయల్ ఎఫిషియెన్సీ అందిస్తాయి. మారుతి సుజుకి డిజైర్ లీటర్ పెట్రోల్ మీద 24.12 కి.మీ మైలేజీ ఇస్తుంటే, హోండా అమేజ్ 18.6 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఫస్ట్ టైం కార్ల కొనుగోలుదారులకు ఓవరాల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. రెండు కార్లు కూడా వైవిధ్య భరితమైన డ్రైవింగ్ ప్రిఫరెన్స్లతోపాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉన్నాయి. పట్టణ పరిస్థితులకు అనుగుణంగానూ, ఎగుడు దిగుడు రోడ్లపైనా తేలిగ్గా వెళ్లగల వెసులుబాటు ఉన్న కార్లివి.
పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, పార్కింగ్ సెన్సర్స్ వంటి ఫీచర్లు ఫస్ట్ టైం కార్ల కొనుగోలుదారుల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. బడ్జెట్, కొనుగోలుదారుల అవసరాలకనుగుణంగా విభిన్న వేరియంట్ల కార్లు అందుబాటులో ఉన్నాయి.
వేరియంట్ —————————- ధర (రూ.ల్లో)
మారుతి సుజుకి డిజైర్ వీఎక్స్ఐ ——– 7.37 లక్షలు
మారుతి సుజుకి డిజైర్ వీఎక్స్ఐ ఏటీ — 7.92 లక్షలు
మారుతి సుజుకి డిజైర్ జడ్ఎక్స్ఐ —— 8.05 లక్షలు
హోండా అమెజ్ ఈ ——————– 6.99 లక్షలు
హోండా అమేజ్ ఎస్ ——————- 7.67 లక్షలు
హోండా అమేజ్ ఎస్ సీవీటీ ———– 8.57 లక్షలు
మారుతి సుజుకి డిజైర్ వీఎక్స్ఐ : ఫస్ట్ టైం కార్ల కొనుగోలుదారులకు డిజైర్ వీఎక్స్ఐ ఎక్స్ లెంట్ చాయిస్. ఏబీఎస్, క్రాష్ వార్నింగ్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఫ్యుయల్ ఎఫిషియెన్సీ, లీటర్ పెట్రోల్ మీద 23.26 కి.మీ, అదనంగా పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, యూఎస్బీ పోర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి
డిజైర్ వీఎక్స్ ఏటీ : ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కోరుకునే వారికి సేఫ్టీ, కన్వీనెన్స్ ఫీచర్లకు పెట్టింది పేరు. వీఎక్స్ఐ వేరియంట్ కంటే మెరుగ్గా లీటర్ పెట్రోల్ మీద 24.12 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
డిజైర్ జడ్ఎక్స్ఐ : ఫాగ్ లైట్స్, ఎల్సీడీ టచ్ స్క్రీన్, వీఎక్స్ఐ వేరియంట్ కారులో మాదిరిగా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
హోండా అమేజ్ ఈ : ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్. ఏబీఎస్, క్రాష్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫీచర్లు ఉన్నాయి. లీటర్ పెట్రోల్ మీద 18.6 కి.మీ. మైలేజీ ఇస్తుంది. అమేజ్ ఈ కారు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉంటాయి.
హోండా అమేజ్ ఎస్ : అమేజ్ ఈ వేరియంట్ కారులో మాదిరిగానే సేఫ్టీ ఫీచర్లు ఆఫర్ చేస్తున్నది. అదనంగా కన్వినియెన్స్ కోసం రేర్ పార్కింగ్ సెన్సర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, యూఎస్బీ పోర్ట్స్ తదితర ఫీచర్లు జత కలిశాయి. లీటర్ పెట్రోల్ మీద 18.6 కి.మీ. మైలేజీ లభిస్తుంది.
హోండా అమేజ్ ఎస్ సీవీటీ : ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఎంచుకునే వారికి సూటబుల్ వేరియంట్. అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సేఫ్టీ కోసం అమేజ్ ఎస్ వేరియంట్ ఫీచర్లు జత చేశారు. లీటర్ పెట్రోల్ మీద 18.3 కి.మీ. మైలేజీ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

