Banks Holidays | డిసెంబర్లో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఇవీ డిటైల్స్!
Banks Holidays | డిసెంబర్ నెలలో ఆదివారాలు, రెండో-నాల్గో శనివారంతో కలిపి 13 రోజులు బ్యాంకులకు సెలవులు.
Banks Holidays | ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ మరో వారంలో ప్రారంభం కాబోతున్నది. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ దఫా క్రిస్మస్ కూడా ఆదివారం వస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో వచ్చే నెల మూడో తేదీన, 12,19, 26, 29,30,31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 4,10,11,18,24,25 తేదీల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
వచ్చే నెలలో మీకు ఏదైనా మీ బ్యాంకు శాఖలో ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా.. ఈ సెలవులను చూసుకుని ప్లాన్ చేసుకోవడం బెటర్. వచ్చే నెలలో బ్యాంకింగ్ సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో చూద్దాం..
- డిసెంబర్ 3 (శనివారం) ———– సెయింట్ ఫ్రాన్సిస్ గ్జావియర్ ఫీస్ట్ — గోవా
- డిసెంబర్ 4 (ఆదివారం) ———- వారాంతపు సెలవు ——————- దేశవ్యాప్తం
- డిసెంబర్ 10 (రెండో శనివారం) — వారాంతపు సెలవు ——————- దేశవ్యాప్తం
- డిసెంబర్ 11 (ఆదివారం) ——— వారాంతపు సెలవు ——————- దేశవ్యాప్తం
- డిసెంబర్ 12 (సోమవారం) ——- పా-టోగాన్ నెంజ్మింజా సంగ్మా —– మేఘాలయ
- డిసెంబర్ 18 (ఆదివారం) ——— వారాంతపు సెలవు ——————– దేశవ్యాప్తం
- డిసెంబర్ 19 (సోమవారం) ——– గోవా విముక్తి దినోత్సవం ————— గోవా
- డిసెంబర్ 24 ( నాల్గో శనివారం) — క్రిస్మస్ ఫెస్టివ్ ————————– దేశవ్యాప్తం
- డిసెంబర్ 25 (ఆదివారం) ——— వారాంతపు సెలవు ——————– దేశవ్యాప్తం
- డిసెంబర్ 26 (సోమవారం) ——- క్రిస్మస్ ఉత్సవాలు ——————– మిజోరం, సిక్కిం, మేఘాలయ
- డిసెంబర్ 29 (గురువారం) ——— గురు గోవింంద్ సింగ్ జీ జయంతి — చండీగఢ్
- డిసెంబర్ 30 (శుక్రవారం) ———- యూ కియాంగ్ నాంగ్బాహ్ ———– మేఘాలయ
- డిసెంబర్ 31 (శనివారం) ———— నూతన సంవత్సర వేడుకలు ——– మిజోరం
షిల్లాంగ్‌లో రెండు దఫాలు ఇలా
షిల్లాంగ్‌లో వచ్చే నెలలో రెండు సార్లు వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. తొలి దఫా 10,11,12 తేదీల్లో, రెండోసారి 24,25,26 తేదీల్లో బ్యాంకులకు సెలవు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

