వడ్డీరేట్లను పెంచిన బ్యాంకులు
పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జాబితాలోకి తాజాగా మరో రెండు బ్యాంక్లు చేరాయి.
- ఎంసీఎల్ఆర్ని సవరించిన కెనరా, బీవోబీ
న్యూఢిల్లీ, జూన్ 13: పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జాబితాలోకి తాజాగా మరో రెండు బ్యాంక్లు చేరాయి. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులు కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్ల వరకు సవరించాయి. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నాయి. ఈ రెండు బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో రుణ గ్రహీతల జేబులకు మరిన్ని చిల్లులు పడనున్నాయి.
కెనరా బ్యాంక్ వడ్డీరేట్లు..
స్వల్పకాలిక రుణాలపై ఎంసీఎల్ఆర్ని కెనరా బ్యాంక్ సవరించింది. ఒక్కరోజు రుణాలపై రేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ రేటు 7.90 శాతం నుంచి 7.95 శాతానికి చేరుకోగా, నెల కాలపరిమితి రుణాలపై రేటు 7.95 శాతం నుంచి 8 శాతానికి, మూడు నెలల కాలపరిమితి రుణాలపై రేటు 8.20 శాతం నుంచి 8.25 శాతానికి, ఆరు నెలల రుణాలపై రేటును 8.55 శాతం నుంచి 8.60 శాతానికి పెంచింది. మిగతా రుణాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచింది. ఏడాది రుణాలపై రేటు 8.75 శాతంగాను, రెండేండ్ల రుణాలపై వడ్డీరేటు 9 శాతం, మూడేండ్ల కాలపరిమితి రుణాలపై రేటు 9.05 శాతంగా ఉంచింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీరేట్లు..
పలు స్వల్పకాలిక రుణాలపై ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బ్యాంక్ ఆఫ్ బరోడా. దీంతో ఒక్క రోజు రుణాలపై రేటు 7.80 శాతం నుంచి 7.85 శాతానికి సవరించిన బ్యాంక్..నెల రుణాలపై రేటు 7.90 శాతం నుంచి 7.95 శాతానికి, మూడు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ని 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ని 8.45 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. దీంతోపాటు అత్యధిక మంది రిటైల్ రుణాలు తీసుకునే ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటును కూడా 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణ రేటు 8.70 నుంచి 8.75 శాతానికి పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

