Home Loans Costly | ఈ బ్యాంకుల ఇండ్ల రుణాలు పిరమే.. వడ్డీతోపాటు ఇతర రిస్క్‌లు కూడా!
Home Loans Costly | ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరాబ్యాంక్ వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి.
Home Loans Costly | పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడానికి ఇలా ఆర్బీఐ రెపోరేట్ పెంచిందో లేదో.. అలా బ్యాంకులు వివిధ రుణాలపై కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వడ్డీరేట్లు సవరిస్తే శనివారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), కెనరా బ్యాంక్ అప్డేట్ చేశాయి. తక్షణం (2022 ఆగస్టు6 నుంచి) సవరించిన బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (బీఆర్ఎల్ఎల్ఆర్) అమల్లోకి వస్తుందని శనివారం బీవోబీ తెలిపింది. రిటైల్ రుణాలపై వడ్డీరేటు 7.95 శాతంగా బీవోబీ నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతానికి అదనంగా మార్క్ అప్/ బేస్ 2.55 శాతం జత కలుస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. బీఆర్ఎల్ఎల్ఆర్ వల్ల ఇండ్ల రుణాలపై రిస్క్ ప్రీమియం పెరుగుతుందని వెల్లడించింది. వేతన జీవులుపై రిస్క్ ప్రీమియం 1.35 ఎక్కువ అవుతుందని తెలిపింది. సిబిల్ స్కోర్, జాబ్ ప్రొఫైల్, రుణ మొత్తం తదితర అంశాలను బట్టి రిస్క్ ప్రీమియం ఖరారవుతుంది.
ఇండ్ల రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీరేట్లు 7.95 నుంచి 9.30 శాతం వరకు వసూలు చేస్తారు. స్వయం ఉపాధితో జీవిస్తున్న వారికి, నాన్ శాలరీడ్ కస్టమర్‌పై అదనంగా 0.10 శాతం భారం పడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఉద్యోగులకు మాత్రం 7.95 శాతం వడ్డీరేటు అమలు చేయనున్నది.
కెనరాబ్యాంక్ ఇలా
కెనరా బ్యాంక్ రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను 7.80 నుంచి 8.30 శాతానికి పెంచేసింది. శుక్రవారం ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు (0.50శాతం) రెపోరేట్ పెంచిన సంగతి తెలిసిందే. పెంచిన నూతన వడ్డీరేట్లు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. మహిళలకు ఇండ్ల రుణాలపై 8.05 శాతం, ఇతరులకు 8.10 శాతం వడ్డీపై మంజూరు చేస్తారు.
ఇండ్ల రుణాల్లో హై రిస్క్ రుణ గ్రహీతలపై 0.05-2 శాతం రిస్క్ ప్రీమియం భారం అదనంగా ఉంటుందని తెలిపింది. హైరిస్క్ హోంలోన్లపై ఆదివారం నుంచి వడ్డీరేటు 8.35-10.30 శాతం మధ్య ఉంటుందని వివరించింది. అన్ని రకాల ఇండ్ల రుణాలు తీసుకునే లో రిస్క్ రుణ గ్రహీతలకు జూలై ఒకటో తేదీ నుంచి వచ్చేనెలాఖరు వరకు 25 బేసిక్ పాయింట్లు రాయితీ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంక్ వెబ్సైట్ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

