బీవోబీ యాప్‌పై ఆర్బీఐ ఆంక్షలు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బీవోబీ వరల్డ్'లోకి కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ రిజర్వ్‌బ్యాంక్ నియంత్రణ విధించింది.
- కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బీవోబీ వరల్డ్’లోకి కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ రిజర్వ్‌బ్యాంక్ నియంత్రణ విధించింది. పర్యవేక్షణా ఆందోళనల ఉన్నందున ఈ యాప్ విధించిన ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని మంగళవారం ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అప్లికేషన్లో ఖాతాదారుల్ని చేర్చుకునేతీరులో కొన్ని పర్యవేక్షణా లోపాల్ని కనుగొన్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ సంతృప్తిమేరకు బ్యాంక్ ఈ లోపాల్ని సరిచేసి, ప్రక్రియను పటిష్ఠపర్చడానికి లోబడి తదుపరి కస్టమర్లను చేర్చుకోవడాన్ని అనుమతిస్తామని వివరించింది. తాజా సస్పెన్షన్ కారణంగా ‘బీవోబీ వరల్డ్’ ప్రస్తుత కస్టమర్లకు ఎటువంటి అంతరాయం ఉండబోదని ఆర్బీఐ తెలిపింది.
దిద్దుబాటు చర్యలు చేపట్టాం: బీవోబీ
రిజర్వ్‌బ్యాంక్ లేవనెత్తిన ఆందోళనల పరిష్కారానికి ఇప్పటికే తాము దిద్దుబాటు చర్యలు చేపట్టామని, మిగిలిన వ్యత్యాల్ని పూడ్చేందుకు మరిన్ని చర్యలు మొదలుపెట్టామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కేంద్ర బ్యాంక్ సంతృప్తిమేరకు ఆర్బీఐ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్టు స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో బీవోబీ పేర్కొంది. తమ కస్టమర్లకు ఎటువంటి అడ్డంకి ఏర్పడదని, మొబైల్ యాప్‌పై నిరంతర సేవల్ని అందుకోవచ్చని బ్యాంక్ హామీ ఇచ్చింది. ఆర్బీఐ తాజా ఉత్తర్వులతో తమ ప్రస్తుత కస్టమర్లు, కొత్త ఖాతాదారులకు తమ ఇతర డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లయిన నెట్‌బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, ఏటీఎం తదితరాలు యథాతథంగా కొనసాగుతాయని వివరించింది. అలాగే తమ మొత్తం వ్యాపార, వృద్ధి ప్రణాళికలపై ఆర్బీఐ చర్యల ప్రభావం ఉండబోదని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

