February Bank Holidays | ఫిబ్రవరిలో బ్యాంకులు పని చేసేది సగం రోజులే.. ఇవీ డిటెయిల్స్..!
February Bank Holidays | నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో కలిపి ఫిబ్రవరిలో బ్యాంకులకు 14 రోజులు సెలవులను ఆర్బీఐ ప్రకటించింది.
February Bank Holidays | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తూ ఉంటారు. డిజిటలైజేషన్‌తో ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నా.. కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలను సందర్శించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రతి ఒక్కరి సమయం చాలా విలువైనది. బ్యాంకు శాఖలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వారు.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తున్నాయా..? లేదా… అన్న విషయం తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. కొత్త సంవత్సరం 2025లో జనవరి మరో ఆరు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది.
వచ్చే శనివారం నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి నెలలో వారాంతపు సెలవులతోపాటు జాతీయ స్థాయి పర్వదినాలు, పండుగలు, ప్రాంతీయ వేడుకల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చేనెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజుల పాటు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది. ఆ సెలవుల జాబితా గురించి తెలుసుకుందామా..!
ఫిబ్రవరి 3 (సోమవారం): సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలలో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 11 (మంగళవారం): థాయిపుసం సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 12 (బుధవారం): శ్రీరవిదాస్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 15 (శనివారం) : లోయి-నాగాయి-నీ సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 19 (బుధవారం) : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బెలాపూర్, ముంబై, నాగ్పూర్ల్లో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 20 (గురువారం) : రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల రాజధానులు ఇటానగర్, ఐజ్వాల్ పట్టనాల్లో బ్యాంకుల మూసివేత.
ఫిబ్రవరి 26 (బుధవారం) : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు గుజరాత్, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛండీగఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 28 (శుక్రవారం): లోసార్ సందర్భంగా సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
వీటితోపాటు వారాంతపు శనివారాలు, ఆదివారాల్లో సెలవులు ఇలా..
ఫిబ్రవరి 2 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 8 (రెండో శనివారం) : దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 9 (ఆదివారం) : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 16 (ఆదివారం) : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 22 (నాలుగో శనివారం) : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 23 (ఆదివారం) : బ్యాంకులకు దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

