Petrol Rates | బంగ్లాదేశ్ షాకింగ్.. 50 శాతం పెట్రోల్ ధరలు పెంపు!
Petrol Rates | బంగ్లాదేశ్ సర్కార్ ప్రజలకు షాకిచ్చింది. శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 51.7 శాతం పెంచేసింది.
Petrol Rates | బంగ్లాదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకున్నది. దాదాపు 50 శాతం ధరలు పెంచేసింది. బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక పెంపు ఇదేనని వార్తలొచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అకస్మాత్‌గా పెంచేయడంతో బంగ్లాదేశ్ వాసులు షాక్‌కు గురయ్యారని ఢాకా ట్రిబ్యూన్ ఒక వార్తాకథనం ప్రచురించింది. అనూహ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేయడంతో వేలాది మంది తమ వాహనాల ట్యాంకులు నింపుకోవడానికి పోటీ పడటంతో రద్దీ ఏర్పడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
కాగా, ఢాకాలోని మహమ్మద్‌పూర్, అగర్గావ్, మాలిబాగ్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ పంపులు మూసేశారు. అర్థరాత్రి నూతన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్ పంపులు తెరిచారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 51.7 శాతం పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లీటర్ పెట్రోల్ ధర 135 టాకాలు (1.43 అమెరికా డాలర్లు)గా ఖరారు చేసింది. ఇంతకుముందు 89 టాకాలు (0.94 యూఎస్ డాలర్స్) ధరతో పోలిస్తే పెంచిన ధర 51.7 శాతం. ఫిబ్రవరి నుంచి జూలై మధ్య బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ 8,014.51 టాకాల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

