Ather’s 450S | ఆ ఈవీ టూ వీలర్స్‌తో సై అంటే సై.. మార్కెట్లోకి ఎథేర్ 450ఎస్ స్కూటర్స్.. ఇవీ డిటైల్స్..!
Ather's 450S | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ స్టార్టప్ ఎథేర్.. మార్కెట్లోకి అత్యంత చౌక ధరకే 450ఎస్, 450ఎక్స్ మోడల్ స్కూటర్లు ఆవిష్కరించింది. వీటి రాకతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు.
Ather’s 450S | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఎథేర్’.. దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక ధరకే ఎథేర్ 450ఎస్ స్కూటర్ ఆవిష్కరించింది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. తొలుత 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న 450ఎస్ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 115 కి.మీ దూరం ప్రయాణించవచ్చు.
అప్ డేటెడ్ 450 ఎస్ స్కూటర్.. 450ఎక్స్ (450X) 2.9 కిలోవాట్లు లేదా (450X) 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లతో వస్తున్నది. అప్ డేటెడ్ 450ఎక్స్ స్కూటర్ 111 కి.మీ, 450ఎక్స్ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ 150 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.30 లక్షల (ఎక్స్ షోరూమ్) తో ప్రారంభం అవుతుంది.
టీవీఎస్ ఐ-క్యూబ్, అంపేర్ ప్రైమస్, ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎథేర్ 450ఎస్ స్కూటర్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఎథేర్ 450 ఈవీ స్కూటర్ ధరలు ఇలా
సిటీ———- 450ఎస్ (2.9 కిలోవాట్లు) – 450ఎక్స్ (2.9 కిలోవాట్ల) – 450ఎక్స్ (3.7 కిలోవాట్లు)
పుణె ——— రూ.1,30,157 ———– రూ. 1,38,157 ———- రూ.1,45,078
ముంబై ——- రూ.1,30,161 ———- రూ. 1,38,162 ——— రూ.1,45,083
బెంగళూరు —- రూ.1,29,999 ——— రూ. 1,38,000 ———– రూ.1,44,921
ఢిల్లీ ———- రూ.1,29,949 ———- రూ. 1,37,950 ———- రూ.1,44,871
హైదరాబాద్ —- రూ.1,29,844 ——– రూ. 1,37,845 ———— రూ.1,44,766
చెన్నై ———– రూ.1,29,949 ——– రూ. 1,37,950 ———– రూ.1,44,871
అహ్మదాబాద్ — రూ.1,10,054 ——– రూ. 1,18,055 ————- రూ.1,24,976
కొచి ———- రూ.1,30,264 ——- రూ. 1,38,265 ————– రూ.1,45,186
ఎథేర్ తన ఎథేర్ 450ఎస్, ఎథేర్ 450ఎక్స్ స్కూటర్ల బుకింగ్స్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు రూ.2500 పే చేసి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ అమౌంట్ పూర్తిగా రీఫండబుల్. దశల వారీగా ఈ మూడు స్కూటర్లను ఆవిష్కరిస్తుంది. ఈ నెల మూడో వారంలో 450ఎక్స్ విత్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ డెలివరీ చేస్తుంది. 450ఎస్ విత్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ఈ నెలాఖరులో డెలివరీ ప్రారంభిస్తుంది. 450ఎక్స్ విత్ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ స్కూటర్ వచ్చే అక్టోబర్‌లో పంపిణీ చేస్తరాు.
సంప్రదాయ 125సీసీ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే తమ 450ఎస్ స్కూటర్ మెరుగైన పనితీరు కలిగి ఉంటుందని, సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చునని ఎథేర్ చెబుతున్నది. 450ఎస్, 450ఎక్స్ స్కూటర్లు గరిష్టంగా 8.58 బీహెచ్పీ విద్యుత్, 26 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి.
కేవలం 3.9 సెకన్లలో 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. 450ఎక్స్ వేరియంట్లు 3.3 సెకన్లలోనే 40 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. మూడు ఈవీ స్కూటర్లు గరిష్టంగా గంటకు 90 కి.మీ. దూరం ప్రయాణిస్తాయి.
ఎథేర్ 450ఎక్స్ స్కూటర్ .. హిల్ హోల్డ్ అసిస్ట్, పార్క్ అసిస్ట్, జీపీఎస్ నేవిగేసన్, రైడ్ మోడ్స్, బ్లూ టూత్ కనెక్టివిటీ, లైవ్ ట్రాకింగ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కలిగి ఉంటాయి. 450ఎక్స్ ఈవీ స్కూటర్ కాస్మిక్ బ్లాక్, సాల్ట్ గ్రీన్, ట్రూ రెడ్, లునార్ గ్రే, స్పేస్ గ్రే, స్టిల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

