న్యూఢిల్లీ : ఆసియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విన్ డాని (Ashwin Dani ) (79) మరణించారు. కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విన్ డాని తీవ్ర అనారోగ్యంతో గురువారం మరణించారని బరువెక్కిన హృదయంతో తెలియచేస్తున్నామని ఆసియన్ పెయింట్స్ పేర్కొంది.
స్టాక్ ఎక్స్ఛేంజ్లకూ కంపెనీ ఈ మేరకు సమాచారం అందించింది. అశ్విన్ డాని 1968 నుంచి కంపెనీతో ప్రస్ధానం కొనసాగించారని, సంస్ధ సాంకేతికంగా అత్యున్నత స్ధాయికి చేరడంలో ఆయన పాత్ర కీలకమని ఆసియన్ పెయింట్స్ పేర్కొంది. అశ్విన్ డాని 1970లో కంపెనీ బోర్డులో ప్రవేశించి 1998 నుంచి 2009 వరకూ వైస్ చైర్మన్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు.
2009 నుంచి ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ చైర్మన్గా బోర్డులో కొనసాగుతున్నారని ఆసియన్ పెయింట్స్ వెల్లడించింది. కంపెనీకి ఆయన అందించిన సేవలకు గాను అశ్విన్ డాని ఎప్పటికీ గుర్తుండిపోతారని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read More :
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 27వ ఘటన