Apple iPhone 15 | బ్లింకిట్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్.. బుక్ చేసుకున్న 10 నిమిషాల్లోనే డెలివరీ
Apple iPhone 15 | వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) ఫోన్లు భారత్ (India)లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ కోసం వినియోగదారులు యాపిల్ స్టోర్స్ ముందు బారులు తీరుతున్నారు. అయితే, మీరు ఇక ఏ మాత్రం క్యూ లైన్లో నిలబడకుండానే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ మీ చేతిలోకి వచ్చే మార్గం ఉంది.
Apple iPhone 15 | వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) ఫోన్లు భారత్ (India)లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. యాపిల్ 15 సిరీస్ కోసం వినియోగదార్లు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ ఫోన్‌ను దక్కించుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఆయా స్టోర్ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. అయితే, మీరు ఇక ఏ మాత్రం క్యూ లైన్లో నిలబడకుండానే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ మీ చేతిలోకి వచ్చే మార్గం ఉంది. అదెలా అంటారా ఫుడ్ డెలివరీ చేసే ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సబ్ బ్రాండ్ బ్లింకిట్ (Blinkit) ద్వారా బుక్ చేసిన పది నిమిషాల్లోనే కొత్త యాపిల్ 15 సిరీస్ ఫోన్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. షాక్ అవుతున్నారు కదూ మీరు విన్నది నిజమే.
బ్లింకిట్.. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను పది నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు యాపిల్ రీసెల్లర్ యూనికార్న్ సంస్థ (Apple reseller Unicorn Info Solutions)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సకాలంలో కస్టమర్లకు కొత్త ఐఫోన్ 15 సిరీస్ పోన్లను డెలివరీ చేయనుంది. ఈ విషయాన్ని బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. ‘అన్ని కొత్త ఐఫోన్ 15 సిరీస్‌లు ఇప్పుడు బ్లింక్ఇట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లను కస్టమర్లకు డెలివరీ చేసేందుకు యాపిల్ రీసెల్లర్ యూనికార్న్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాము. ఫోన్ లాంచింగ్ రోజున బ్లింకిట్ కస్టమర్లకు ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే ఫోన్ డెలివరీ చేస్తాం. ఢిల్లీ, ముంబై, పూణె నగరాల్లో మాత్రం ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి’ అని ఆయన వెల్లడించారు. అయితే, ఇతర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయా.. లేదా.. అన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.
The all-new iPhone 15 is now available on Blinkit!
We’ve partnered with @UnicornAPR again to make this a reality for Blinkit customers in Delhi NCR, Mumbai & Pune (for now).
Super proud of the platform that can put the new iPhone in your hands on launch day in 10 minutes!💛 pic.twitter.com/QTFYkJ2nFL
— Albinder Dhindsa (@albinder) September 22, 2023
ఐఫోన్ 15 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో పోల్చితే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు కీలక అప్ గ్రేడ్స్ చేసింది ఆపిల్. 48 మెగా పిక్సెల్ కెమెరా, యూఎస్బీ-సీ పోర్టు, కొత్త చిప్ సెట్, డైనమిక్ ఐలాండ్ తో పాటు మరిన్ని మార్పులు చేసింది. లుక్ కాస్త సేమ్ కన్పిస్తున్నా, ఫీచర్లు, పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఇంకా బెటర్ గా ఉన్నట్లు తెలిసింది.
ఇక ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో, పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ బేస్ స్టోరేజీ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా, 15 ప్లస్ ధర రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభం కానుండగా, 15 ప్రొ మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,59,900గా ఉంది.
మరో విశేషం ఏంటంటే.. ప్రారంభ సేల్‌లో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు ఐఫోన్ 15 పై స్పెషల్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత ఫోన్ ఎక్స్ఛేంజీకి రూ. 9,000 వరకు బోనస్ ఇస్తున్నారు. అలాగే పలు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్ ఫోన్లకు రూ. 5,000 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో మొత్తం డిస్కౌంట్ కలిపి రూ. 14,000 అవుతుంది. అప్పుడు ఐఫోన్ 15 బేసిక్ మోడల్ రూ. 65,900 కే లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజీ బోనస్ మీ పాత ఫోన్ ధరను బట్టి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్ కాస్ట్ రూ. 20 వేలకు మించి ఉంటే రూ. 9,000 ఎక్స్ఛేంజీ బోనస్ ఉంటుంది. అదే రూ. 15,000 ఉంటే ఎక్స్ఛేంజీ బోనస్ రూ. 6,000 గా ఉంటుంది.
Also Read..
Apple iPhone | యాపిల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ షురూ
Justin Trudeau | ట్రూడోకు తగ్గుతున్న ప్రజాదరణ.. 50 ఏళ్లలో అత్యంత చెత్త ప్రధానిగా
Hijab | కఠినమైన హిజాబ్ చట్టాన్ని ఆమోదించిన ఇరాన్ పార్లమెంట్.. ఉల్లంఘిస్తే భారీ శిక్షే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

