న్యూయార్క్, ఆగస్టు 25: యాపిల్ సంస్థ కూడా ఇతర కంపెనీల మాదిరిగానే మడతపెట్టే ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెల 9న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్న సంస్థ..అదే రోజు వాచెస్, ఎయిర్ప్యాడ్స్ను కూడా అందుబాటులోకి తీసుకోస్తున్నది. ఈ సందర్భంగా మడతపెట్టే ఫోన్ను కూడా అదే రోజు విడుదల చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ దీనిని వచ్చే ఏడాదికి వాయిదావేసింది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో తీర్చిదిద్దిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అతిపెద్ద డిస్ప్లే, కెమెరా పనితీరు మెరుగుపర్చనున్నది. ఈ ఫోన్ ధర రూ.89,900 నుంచి రూ.1,64,900 స్థాయిలో ఉంటుందని అంచనా. అలాగే యాపిల్ఖ వాచ్ అల్ట్రా 3 ఫాస్టర్ చార్జింగ్, 5జీ సపోర్ట్, శాటిలైట్ కనెక్టివిటీ, అతిపెద్ద స్క్రీన్, బీపీ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.