హైదరాబాద్, ఆగస్టు 11: అపోలో హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం సగానికి సగం తగ్గి రూ.167 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
ఏడాది క్రితంతో పోలిస్తే 47 శాతం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడా ది ప్రాతిపదికన 16 శాతం ఎగబాకి రూ.4,418 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.