Gold Price | మరో 1,000 తగ్గిన బంగారం ధర.. 3 రోజుల్లో ఎంతంటే?
బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. గురువారం తులం రేటు మరో రూ.1,000కిపైగా పడిపోయింది. దీంతో 24 క్యారెట్ 10 గ్రాముల విలువ హైదరాబాద్‌లో రూ.70 వేల దిగువకు చేరి రూ.69,820గా నమోదైంది.
- 3 రోజుల్లో రూ.5,000 పతనం
- హైదరాబాద్‌లో రూ.70 వేల దిగువకు తులం రేటు
Gold Price | న్యూఢిల్లీ, జూలై 25: బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. గురువారం తులం రేటు మరో రూ.1,000కిపైగా పడిపోయింది. దీంతో 24 క్యారెట్ 10 గ్రాముల విలువ హైదరాబాద్‌లో రూ.70 వేల దిగువకు చేరి రూ.69,820గా నమోదైంది. బుధవారంతో చూస్తే రూ.1,040 తగ్గింది. ఇక 22 క్యారెట్ రూ.950 దిగి రూ.64,000గా ఉన్నది. ఢిల్లీ లో మాత్రం రూ.70,650 వద్ద స్థిరపడింది.
ఇక్కడ అంతకుముందు రెండు రోజుల్లో రూ.4,000 దిగజారగా.. మొత్తం ఈ మూడు రోజుల్లో రూ.5,000 పతనం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల క్షీణత, నగల వర్తకులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంబులియన్ మార్కెట్‌ను దిగువముఖం పట్టిస్తున్నాయి. మరోవైపు కిలో వెండి ధర కూడా ఢిల్లీలో రూ.3,500 తగ్గి రూ. 84,000గా ఉన్నది. హైదరాబాద్‌లో రూ.84,500 పలుకుతున్నది. బడ్జెట్లో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలకు కోత పెట్టడంతో.. ఒక్కసారిగా బయ్యర్లు, ఇన్వెస్టర్లు రివర్స్‌గేర్ వేశారు. కాగా, గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం 2361 డాలర్లు పలికితే.. వెండి 28.04 డాలర్లుగా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

