జీవిత బీమా పథకాల్లో యాన్యునిటీ అనే పదం చాలా కామన్‌గా వినిపిస్తుంది. యాన్యునిటీ బీమా పథకాల్లో ఏక మొత్తంగా లేదా సింగిల్ ప్రీమియంతో పొదుపు చేసినప్పుడు రెగ్యులర్ చెల్లింపులు జరిపే పద్ధతే యాన్యునిటీ. ఈ రాబడికి గ్యారంటీ ఇస్తారు. ఇందులో సత్వర యాన్యునిటీ ప్లాన్స్, డిఫర్డ్ యాన్యునిటీ ప్లాన్స్ అని రెండు రకాలు. మొదటి దానిలో ఏకమొత్తంగా మదుపు చేసిన తర్వాత వెంటనే రెగ్యులర్ చెల్లింపులు జరుగుతాయి. ఈ రకమైన పాలసీని తీసుకున్నవారు బతికి ఉన్నంత కాలంలో రెగ్యులర్ చెల్లింపులు జరుగుతాయి. డిఫర్డ్ యాన్యునిటీ ప్లాన్స్ అంటే పెన్షన్ పథకాలే. ఈ పథకాల్లో రెగ్యులర్ చెల్లింపులు నిర్ణీత కాలపరిమితి తర్వాత మొదలవుతాయి. కాల పరిమితి ఎన్నేండ్లనేది ముందుగానే ఎంచు కోవచ్చు. ఈ పథకాల్లో చేసిన మదుపుపై ఆదాయ పన్ను చట్టం 80సీసీసీ ప్రకారం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.