WPI Inflation | మూడేండ్ల కనిష్టానికి ఏప్రిల్ టోకు ద్రవ్యోల్బణం..ఏమైందంటే..?!
WPI Inflation | ఏప్రిల్ టోకు ద్రవ్యోల్బణం మూడేండ్ల కనిష్ట స్థాయి మైనస్ 0.92 శాతానికి దిగి వచ్చింది.
WPI Inflation | ఏప్రిల్ హోల్ సేల్ ద్రవ్యోల్బణం మూడేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. టోకు ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇదే తొలిసారి. 2022 ఏప్రిల్ తో పోలిస్తే గత నెల టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.92 శాతంగా నమోదైంది. గతేడాది ఏప్రిల్ నెలలో 1.34 శాతంగా రికార్డయింది. వివిధ వస్తువుల ధరలు తగ్గడమే దీనికి కారణమని తెలుస్తున్నది.
ఏప్రిల్ నెలలో ఫుడ్ ఇండెక్స్ గతేడాదితో పోలిస్తే 0.17 శాతం, మార్చితో పోలిస్తే 2.32 శాతం పెరిగింది. ఫ్యుయల్ 0.93, విద్యుత్ 8.96 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో టోకు ద్రవ్యోల్బణం దిగి రావడానికి కారణం అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిస్ట్ మదన్ సబ్నావిస్ పేర్కొన్నారు. కమొడిటీ రేట్లు దిగి రావడంతో మాన్యుఫాక్చరింగ్ గూడ్స్ ధరలు తగ్గాయి.
గతేడాది మే నెలలో నమోదైన టోకు ద్రవ్యోల్బణం 16.63 శాతం. ఇది ఇరవయ్యేండ్ల గరిష్టం. నాటి స్థాయి నుంచి హోల్ సేల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.
క్రూడాయిల్, పవర్, ఆహార, ఆహారేతర ఉత్పత్తుల ధరల ఆధారంగా ద్రవ్యోల్బణం రేట్లు గణిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టస్థాయికి దిగి వచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

