హైదరాబాద్, జూలై 13: అమెరికాకు చెందిన చికెన్ బ్రాండ్ పొపాయ్స్ రెస్టారెంట్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. తన తొలి రెస్టారెంట్‌ను ప్రారంభించింది. డొమినోస్ పిజ్జా పేరుతో అవుట్లెట్లను నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌కు చెందినదే ఈ సంస్థ. భిన్న రుచులు కోరుకుంటున్న హైదరాబాద్ వాసులకు కొత్త బ్రాండ్‌ను అందించాలనే ఉద్దేశంతో తొలి రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఎండీ, సీఈవో సమీర్ ఖేతర్పాల్ తెలిపారు.
రానున్న రోజుల్లో ఇక్కడే 10 కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఒక్కో స్టోర్‌తో 12 నుంచి 20 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.750 కోట్ల మేర పెట్టుబడితో 220 డొమినోస్ పిజ్జా అవుట్లెట్లు, 35 పొపాయ్స్ రెస్టారెంట్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు.