Amazon | 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ షురూ.. ఆ ఫోన్లపై భారీగా డిస్కౌంట్
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారీ ఆఫర్లతో మరోసారి వినియోగదారుల ముందుకు వస్తున్నది. ప్రతి ఏడాదిలానే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic Day Sale) పేరుతో డిస్కౌంట్ ధరలకే వస్తువులను అందించనుంది.
Amazon | ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారీ ఆఫర్లతో మరోసారి వినియోగదారుల ముందుకు వస్తున్నది. ప్రతి ఏడాదిలానే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic Day Sale) పేరుతో డిస్కౌంట్ ధరలకే వస్తువులను అందించనుంది. జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ వెల్లడించింది. ఇందులో మొబైల్ ఫోన్లు, ఫోన్ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్‌లు, టీవీలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐలపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇక అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్ మొదలుకానుంది. కాగా, ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమెజాన్ కంటే ఒక రోజు తర్వాత అంటే జనవరి 14న అది అందుబాటులోకి రానుంది.
మొబైల్ ఫోన్లపై 40 శాతం వరకు అమెజాన్ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ఐఫోన్ 13 (iPhone 13)ను రూ.52,999కే లభించనుంది. ప్రస్తుతం దీని ఎమ్మార్పీ రూ.59,999గా ఉంది. సేల్‌లో మరింత తక్కువకే కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్ 23 ప్లస్ (Galaxy S23 Plus).. ఫోన్లను ప్రస్తుతం రూ.10వేల డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. సేల్ సమయంలో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక మోటోరొలా రేజర్ 40 అల్ట్రా, ఐకూ 12, రియల్మీ నార్జో 60ఎక్స్ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34, రెడ్మీ ఐ 12, లావా బ్లేజ్ 5జీ, వన్‌ప్లస్ 11, హానర్ 90, వన్‌ప్లస్ నార్డ్ 3తోపాటు వివిధ ఫోన్లపై డిస్కౌంట్లు అందించనుంది. ఇక, ల్యాప్టాలు, స్మార్ట్ వాచ్‌లపై 75 శాతం, స్మార్ట్ టీవీలు, ఇతర గృహ వినియోగ వస్తువులపై 65 శాతం వరకు రాయితీ అందిస్తామని తెలిపింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- amazon prime
- discounts
- emi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

