Fixed Deposits | ఎందులో మదుపుచేస్తే పెట్టుబడి రెట్టింపవుతుంది? అందుకు ఎంతకాలం పడుతుంది? తెలుసుకోండిలా.. !
ప్రతీ మదుపుదారు తన పెట్టుబడి వేగంగా వృద్ధిచెందాలని ఆశిస్తాడు. మరి ఎందులో మదుపుచేస్తే పెట్టుబడి రెట్టింపవుతుంది? అందుకు ఎంతకాలం పడుతుంది అనేది ఎవరికివారే చిన్న సూత్రంతో తెలుసుకోవచ్చు. అదే ‘72 రూల్’.
- పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్డీల్లో మదుపు
Fixed Deposits | ప్రతీ మదుపుదారు తన పెట్టుబడి వేగంగా వృద్ధిచెందాలని ఆశిస్తాడు. మరి ఎందులో మదుపుచేస్తే పెట్టుబడి రెట్టింపవుతుంది? అందుకు ఎంతకాలం పడుతుంది అనేది ఎవరికివారే చిన్న సూత్రంతో తెలుసుకోవచ్చు. అదే ‘72 రూల్’. ఈ రూల్ ఉపయోగించి, మీ డబ్బు ఏ మదుపు సాధనంలో, ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో క్షణాల్లో గ్రహించవచ్చు. ఆయా సాధనం ద్వారా లభించే వార్షిక వడ్డీ/రాబడి రేటును 72తో భాగిస్తే చాలు…
బ్యాంక్ ఎఫ్
దాదాపు అన్ని బ్యాంక్ కనిష్ఠంగా ఏడు రోజుల నుంచి గరిష్ఠంగా పదేండ్ల కాలపరిమితి ఫిక్స్ డిపాజిట్లను (ఎఫ్డీ) అందిస్తున్నాయి. ఒక్కో బ్యాంకూ ఆయా కాలపరిమితికి అనుగుణంగా వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్ 7 రోజులు-10 ఏండ్ల ఎఫ్ 3-7.1 శాతం, హెచ్ బ్యాంక్ 3 శాతం నుంచి 7.25 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఉదాహరణకు మీరు బ్యాంక్ రూ.1 లక్ష డిపాజిట్ చేయాలనుకున్నారనుకోండి. ఆ బ్యాంక్ 7 శాతం వార్షిక వడ్డీని ఇస్తున్నట్టయితే, అది రెట్టింపు అవ్వాలంటే పట్టే సమయాన్ని ’72 రూల్’తో ఇలా లెక్కించవచ్చు.
72/7=10.28 ఏండ్లు
అంటే మీ రూ.1 లక్ష బ్యాంక్ ఎఫ్ రూ.2 లక్షలు అవడానికి పట్టే సమయం దాదాపు 10 ఏండ్ల మూడు నెలల ఒకవారం.
మ్యూచువల్ ఫండ్స్
ఆర్థిక క్రమశిక్షణతో మ్యూచువల్ ఫండ్స్ లో చేసే పెట్టుబడులకు దీర్ఘకాలిక రాబడి 12-15 శాతం మేర ఉంటుందంటూ నిపుణులు చెపుతుంటారు. ఫండ్స్ కూడా కొంత మార్కెట్ రిస్క్ ఉంటుంది. 12 శాతం వార్షిక రాబడి అంచనాను పరిగణనలోకి తీసుకుంటే వీటిలో రూ.1 లక్ష మదుపు ఆరేండ్లలో రూ.2 లక్షలు అవుతుంది. ఫార్ములా ఇదీ… 72/12=6 ఏండ్లు
స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ప్రామాణికమైన నిఫ్టీ-50 చూస్తే గత ఏడాది 13.5 శాతం రాబడినిచ్చింది. అయితే ఈ పెట్టుబడికి రిస్క్, ఒడిదుడుకులూ ఉంటాయని మర్చిపోవద్దు. గత ఏడాది రాబడి ఆధారంగా లెక్కిస్తే రూ.1 లక్ష పెట్టుబడి రూ.2 లక్షలు అవడానికి పట్టే సమయం దాదాపు ఐదేండ్ల 3 నెలల 3 వారాలు. ’72 రూల్’ ప్రకారం.. 72/13.5=5.33 ఏండ్లు
పీపీఎఫ్
ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) డిపాజిట్లపై 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు ఉంది. 2020 ఏప్రిల్ నుంచి పీపీఎఫ్ వడ్డీ రేటును సవరించలేదు. ఇందులో మదుపు చేసినా దాదాపు పదేండ్లు పడుతుంది. ఫార్ములా ఇది..72/7.1=10.14 ఏండ్లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

