వాషింగ్టన్, జూన్ 3: భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో వరల్డ్ బ్యాంక్ 14వ ప్రెసిడెంట్గా బంగాను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాటు కొనసాగనున్నారు. ‘అజయ్ బంగాకు స్వాగతం పలుకుతున్నాం..పేదరికం లేని ప్రపంచాన్ని సృష్టించడానికి తమవంతుగా కృషి చేస్తున్నాం’ అని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.