లక్ష కోట్ల పైకి ఎయిర్టెల్ ఆదాయం

న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వార్షిక టర్నోవర్ తొలిసారి లక్ష కోట్లకుపైగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.1,00,616 కోట్లుగా ఉన్నట్లు సోమవారం ఎయిర్టెల్ తెలిపింది. 2019-20లో రూ.84,676 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇక ఎయిర్టెల్ ఇండియా రెవిన్యూ 18 శాతం ఎగబాకి రూ.72,308.3 కోట్లుగా ఉంటే, ఎయిర్టెల్ ఆఫ్రికా రెవిన్యూ 19 శాతం ఎగిసి రూ.28,863.3 కోట్లుగా ఉన్నది. కాగా, సంస్థ ఏకీకృత నికర లాభం ఈ జనవరి-మార్చిలో రూ.759 కోట్లుగా నమోదైంది. పోయినసారి రూ.5,237 కోట్ల నష్టాలను చవిచూసింది. ఏకీకృత ఆదాయం 11.9 శాతం పుంజుకుని రూ.25,747 కోట్లకు చేరింది. 2019-20తో పోల్చితే 2020-21లో సంస్థ నష్టం రూ.32,183 కోట్ల నుంచి రూ.15,084 కోట్లకు తగ్గింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- airtel
- mobile network
- profits
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

