Flight Journey Costly | దేశీయ ఫ్లైట్ జెర్నీ కాస్ట్లీ..ఎందుకంటే?!
Flight Journey Costly | కరోనా మహమ్మారి వేళ విదేశాలకెళ్లడం సంగతి దేవుడెరుగు.. దేశీయంగా వివిధ ప్రాంతాల మధ్య విమానాల్లో ప్రయాణించే వారి జేబులకు ....

Flight Journey Costly | కరోనా మహమ్మారి వేళ విదేశాలకెళ్లడం సంగతి దేవుడెరుగు.. దేశీయంగా వివిధ ప్రాంతాల మధ్య విమానాల్లో ప్రయాణించే వారి జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తున్నది. విమాన సర్వీసుల ప్రయాణ టిక్కెట్ల ధరలపై కేంద్ర విమానయాన శాఖ పరిమితులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే దీనికి నిదర్శనం. కనిష్ట లేదా గరిష్ఠ పరిమితులను 9.83 నుంచి 12.82 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగిన తర్వాత 2020 మే 25న విమాన టిక్కెట్ల ధరలపై కేంద్రం పరిమితులు విధించింది. గురువారం కేంద్ర పౌర విమానయానశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం విమాన టిక్కెట్ల ధరలు ఎలా పెరిగాయో చూద్దామా..!
40 నిమిషాల నిడివి గల విమాన టికెట్ ధర 11.53 % పెంపు
లోయర్ లిమిట్ అంటే 40 నిమిషాలు ప్రయాణించే విమానాల టికెట్ ధరలు రూ. 2,600 నుంచి రూ.2,900లకు పెంచేసింది కేంద్ర విమానయానశాఖ. ఇది 11.53 శాతం పెంపు. ఇక అప్పర్ లిమిట్ కింద 40 నిమిషాల్లో ప్రయాణించే విమాన టికెట్ 12.82 శాతంతో రూ,8,800లకు పెంచివేసింది.
40-60 నిమిషాల్లోపు విమాన యాన టికెట్ల ధరలు ఇలా
అలాగే 40-60 నిమిషాల మధ్య ప్రయాణించే విమాన టికెట్ల ధరలు రూ.3,300 నుంచి రూ.3,700లకు పెరిగింది. ఈ విమానాల్లో ప్రయాణికుల అప్పర్ లిమిట్ ధరలు 12.24 శాతం ఎక్కువై రూ.11 వేల (12.5%)కు చేరుకున్నది.
60-90 నిమిషాల ప్రయాణం గల విమాన టికెట్ ధర లోయర్ లిమిట్ 12.5 శాతం పెంచడంతో రూ.4,500లకు చేరుకుంది. అప్పర్ లిమిట్ టికెట్ ధర 12.82 శాతం పెంచేసి రూ.13,200 చేసింది.
180-210 నిమిషాల నిడివి గల ప్రయాణ టికెట్ రూ.9800
ఇప్పుడు 90-120, 120-150, 150-180 and 180-210 నిమిషాల ప్రయాణ నిడివి గల విమాన ప్రయాణ లోయర్ లిమిట్ టికెట్ ధరలు రూ.5,300, రూ.6700, రూ.8,300, రూ.9,800గా నిర్ణయించింది విమానయానశాఖ. ఇప్పటి వరకు రూ.4,700, రూ.6,100, రూ.7,400, రూ.8,700 వసూలు చేసేవారు.
గరిష్ఠంగా 12.74 శాతం ధర పెంపు
90-120, 120-150, 150-180, 180-210 నిమిషాల నిడివి గల విమాన ప్రయాణానికి అప్పర్ లిమిట్ టికెట్ ధర 12.3 %, 12.42 %, 12.74%, 12.39 శాతం పెరిగింది. అయితే, ఈ ఆదేశాల్లో ప్రభుత్వం ప్యాసింజర్ సెక్యూరిటీ ఫీ, విమానాశ్రయాల డెవలప్మెంట్ ఫీజు, జీఎస్టీ చేర్చలేదు. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ చార్జీలు పెరుగుతాయి.
ఎయిర్ ఫ్యూయల్ ధరల పెరుగుదల వల్లే
కోవిడ్-19 నేపథ్యంతోపాటు ఎయిర్ ఫ్యూయల్ ధరలు పెరగడం వల్ల విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు టికెట్ల ధరలు పెంచినట్లు కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Paytm’s IPO | పేటీఎంకు షాక్.. ఐపీవోకు అనుమతి లభిస్తుందా.. ఎందుకంటే?!!
Electric vehicles | పెట్రో ధరల పెంపు ఎఫెక్ట్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు
Huzurabad | ఈటలకు షాక్.. ‘గెల్లు’కే మా ఓటన్న ముదిరాజ్‌లు
Vinesh Phogat: రెజ్లింగ్‌కు తిరిగొస్తానో లేదో.. తీవ్ర నిరాశలో వినేష్ ఫోగాట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

