Adani Slips Rich List | అదానీని దాటేసిన జెఫ్ బెజోస్.. గౌతం అదానీ ఇలా లాస్!
Adani Slips Rich List | భారతీయ కుబేరుడు గౌతం అదానీ ఒక్కరోజులో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో ర్యాంకుకు పడిపోయారు.
Adani Slips Rich List | భారత్, ఆసియా ఖండంలోనే కుబేరుడు-బిలియనీర్ గౌతం అదానీ.. వరల్డ్ బిలియనీర్స్ సూచీలో ఒక ర్యాంక్ వెనుక బడ్డారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గౌతం అదానీ నాలుగో స్థానానికి పడిపోయారు. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. మూడో ర్యాంకులోకి దూసుకెళ్లారు. సియాటెల్ కేంద్రంగా ఏర్పాటైన జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్.. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు తన ఫ్లాగ్షిప్ వెబ్సైట్ నుంచి ఎలక్ట్రానిక్, హౌస్ హోల్డ్ గూడ్స్, ఇతర వస్తువులు, ఉత్పత్తులను విక్రయిస్తుంది. బ్లూ ఒరిజిన్ అనే పేరుతో సొంతంగా అంతరిక్ష పరిశోధనలు జరిపే అంతరిక్ష పరిశోధనా సంస్థను కలిగి ఉంది.
ఈ నెల 24 నాటికి జెఫ్ బెజోస్ నికర ఆస్తి 121 బిలియన్ డాలర్లకు పెరిగింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే గౌతం అదానీ వ్యక్తిగత సంపద 872 మిలియన్ డాలర్లు కోల్పోయారు. ఏడాది కాలంలో మొత్తం 683 మిలియన్ డాలర్ల సంపదను పోగొట్టుకున్నారు. ఇప్పటికే అగ్ర స్థానంలో నిలిచిన లగ్జరీ గూడ్స్ సంస్థ లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ వ్యక్తిత సంపద 188 బిలియన్ డాలర్లు. ఇక రెండో స్థానంలో టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలన్‌మస్క్ కొనసాగుతున్నారు.
తాజాగా గౌతం అదానీ వ్యక్తిగత సంపద 120 బిలియన్ డాలర్లు మాత్రమే. కేవలం ఒక్క రోజులో అదానీ 872 మిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద పోగొట్టుకున్న అదానీ.. గత ఏడాది కాలంలో 683 మిలియన్ డాలర్లు నష్టపోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రతి రోజూ 500 ప్రముఖుల ర్యాంకింగ్స్ నమోదు చేసింది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ప్రతి ట్రేడింగ్ ముగిసే సమయానికి అప్డేట్ చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

