సమతుల ఆహారంతోనే మన శరీరాన్ని వ్యాధుల బారినుంచి రక్షించుకోవచ్చని మన ప్రాచీన గ్రంధాల నుంచి నేటి వైద్య నిపుణుల వరకూ చెబుతుంటారు.ముఖ్యంగా ఈ శీతాకాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచేందుకు అనుగుణమైన ఆహారం అవసరం. గత ఏడాది నుంచి కరోనా మహమ్మారితో ప్రజలు ఇండ్లకే పరిమితమైన క్రమంలో ఇంటిలో తయారుచేసిన వంటకాలకే జనం మొగ్గుచూపుతున్నారు.
సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక రెసిపీలనూ ఈ రెండేండ్లుగా ప్రజలు ఇంటి వద్దే ఆస్వాదిస్తున్నారు. ఇక రోగనిరోధక వ్యవస్ధ మెరుగయ్యేందుకు దోహదపడే ఆహారం ఇష్టపడుతున్నారు. హోం కుకింగ్కు స్వచ్ఛమైన, ప్రపంచశ్రేణి నాణ్యత కలిగిన నూనెలు అవసరం. వంటకాలు ఎక్కువసేపు తాజాగా ఉండటంతో పాటు కుటుంబసభ్యులందరికీ రుచికరంగా ఉండేందుకు మెరుగైన నూనెలు కీలకం.
ప్రపంచశ్రేణి ప్రీమియం సూపర్ రిఫైన్డ్ ఆయిల్‌ను గోల్డ్ డ్రాప్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చిందని కంపెనీ డైరెక్టర్, సేల్స్, మార్కెటింగ్ మితేష్ లోహియ చెప్పారు. గోల్డ్ డ్రాప్లో అత్యాధునిక రిఫైనింగ్ సదుపాయాల్లో, కఠిన టెస్టింగ్ ప్రక్రియతో ఉత్తమ ముడిపదార్ధాలను వాడతారని, ప్రతి డ్రాప్లో తిరుగులేని నాణ్యత, స్వచ్ఛత ఉంటుందని చెప్పుకొచ్చారు. నాణ్యతలో రాజీపడని కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా నూనెలు తయారవుతాయని అన్నారు. ఆసియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ 2019గా గోల్డ్ డ్రాప్‌ను ఐబీసీ, యూఎస్ఏ గుర్తించిందని తెలిపారు.