Safety Cars | 90 శాతం మంది సేఫ్టీ కార్లకే ప్రియారిటీ.. మిగతా రెండు అంశాలు కూడా.. !
Safety Cars | ప్రస్తుతం కార్లు కొనాలనుకునే వారు సేప్టీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్, ఫ్యుయల్ మైలేజీ పైనా ఫోకస్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
Safety Cars | ఇప్పుడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సుదూరం ప్రయాణం చేయాలంటే కారులో సేఫ్టీ ఫీచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్‌లపైనే కస్టమర్లు మనస్సు పారేసుకుంటున్నారని స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసేస్ సంస్థలు సంయుక్తంగా నిర్వంచిన సర్వేలో తేలింది.
ప్రతి పది మందిలో తొమ్మిది మంది సేఫ్టీ ఫీచర్లు, వాటికి ఇచ్చే ర్యాంకింగ్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అటుపై ఫ్యుయల్ మైలేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 67 శాతం మంది సేఫ్టీ రేటింగ్ వేరియంట్లకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు కారు కొనని వారు 37 శాతం మంది వచ్చే ఏడాదిలోగా రూ.5 లక్షల్లోపు ధర కల ఎంట్రీ లెవల్ కారును కొనాలని భావిస్తున్నట్లు చెప్పారు.

18-54 ఏండ్ల మధ్య వయస్సు గల వారితో ఈ సర్వే నిర్వహించారు. 80 శాతం మంది పురుషులు, 20 శాతం మంది మహిళలు ఉన్నారు. కార్లు కొనాలనుకునే వారు.. ఆయా కార్ల క్రాష్ రేటింగ్‌పై 22.3 శాతం మంది.. వాటిల్లో వాడే ఎయిర్ బ్యాగ్స్ గురించి 21.6 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. 15 శాతం ఫ్యుయల్ మైలేజీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
పది రాష్ట్రాల్లో వెయ్యి మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

