Personal Loan | అత్యవసర పరిస్థితుల్లో నిధులు దొరక్క పోవచ్చు. అప్పటికప్పుడు డబ్బు కావాలంటే పర్సనల్ లోన్లే శరణ్యం. ప్రభుత్వోద్యోగి అయినా, కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ అయినా పర్సనల్ లోన్ తీసుకోవాల్సిందే. కాకపోతే ఇంటి రునం, కారు లోన్, బంగారం రుణంతో పోలిస్తే పర్సనల్ లోన్ మీద వడ్డీరేట్లు కాస్త ఎక్కువే. అయినా ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లు చెక్ చేసుకుని తక్కువ వడ్డీపై రుణాలిచ్చే బ్యాంకులను ఎంచుకోవచ్చు. అంతే కాదు మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నా.. వడ్డీరేటు దిగి వస్తుంది.
అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తీసుకునే లోన్ వ్యక్తిగత రుణం.. దీనికి కొల్లెటరల్ సెక్యూరిటీ ఉండదు. బంగారం రుణం తీసుకుంటే బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ప్రస్తుత ఐదు బ్యాంకులు తక్కువ వడ్డీరేటుపై పర్సనల్ రుణాలిస్తున్నాయి. అవేమిటో చూద్దామా..!
బ్యాంక్ పేరు —– —– —– వ్యక్తిగత రుణం మొత్తం — రుణం గడువు – వడ్డీరేటు (శాతం)
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర — — రూ.20 లక్షల వరకూ —- 84 నెలలు — — 10.00
పంజాబ్ & సింధ్ బ్యాంక్ — రూ. 3 లక్షల వరకూ — — 60 నెలలు — — 10.15-12.80
బ్యాంక్ ఆఫ్ ఇండియా — — రూ.20 లక్షల వరకూ — — 84 నెలలు — — 10.25
ఇండస్ ఇండ్ బ్యాంక్ — — రూ.25 లక్షల వరకూ — –12 -60 నెలలు — 10.25-32.02
బ్యాంక్ ఆఫ్ బరోడా — — — రూ.20 లక్షల వరకూ — — 48-60 నెలలు- – 10.35-17.50