ఎయిర్ ట్రాఫిక్‌లో శంషా‘బాద్షా’
ఎయిర్ ట్రాఫిక్‌లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దూసుకుపోతున్నది.
- కొవిడ్ తర్వాత లండన్‌కు 48% పెరిగిన ప్రయాణికుల సంఖ్య
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎయిర్ ట్రాఫిక్‌లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దూసుకుపోతున్నది. కొవిడ్ తర్వాత మళ్లీ పూర్వ స్థితికి చేరుకోవడంలో ఈ ఎయిర్‌పోర్టు దేశంలోని ఇతర విమానాశ్రయాల కంటే ఎంతో ముందంజలో ఉన్నది. ప్రత్యేకించి ఇక్కడి నుంచి లండన్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొవిడ్‌కు ముందు 2019 ఆగస్టులో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 11,911 మంది లండన్‌కు వెళ్లగా.. ఈ ఏడాది ఆగస్టులో ఆ సంఖ్య 17,584కు పెరిగింది. తద్వారా ఏకంగా 48% వృద్ధిరేటు నమోదైంది. కొవిడ్ తర్వాత దేశంలోని మరే ఇతర ప్రధాన విమానాశ్రయాల్లోనూ లండన్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఈస్థాయిలో పెరగలేదు. పైపెచ్చు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 49% తగ్గింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం ఎయిర్ ట్రాఫిక్‌లో శంషాబాద్ జోరుకు ప్రధాన కారణం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

