Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Maruti Suzuki Swift | దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2005లో భారత్ మార్కెట్లో ఎంటరైన మారుతి సుజుకి కీలక మైలురాయిని దాటింది. మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్’.. శుక్రవారం 30 లక్షల యూనిట్లు విక్రయించింది.
Maruti Suzuki Swift | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలురాయిని దాటేసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2005లో తొలుత భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘స్విఫ్ట్ (Swift)’.. 30 లక్షల కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది. 2005లో తొలుత ఆవిష్కరించినప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. ఇటీవలే మారుతి తన స్విఫ్ట్ (Swift) నాలుగో జనరేషన్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది.
అసాధారణ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన వారసత్వంతో ముందుకు సాగుతున్న స్విఫ్ట్.. యువతరం కోసం రూపొందించింది. అంతే కాదు భావ సారూప్యం గల కస్టమర్లనూ ఆకర్షిస్తోంది. భారత్ మార్కెట్లోకి వచ్చిన ఎనిమిదేండ్లకు 2013 నవంబర్‌లో తొలి పది లక్షల మైలురాయిని దాటింది. మరో ఐదేండ్లకు అంటే 2018లో 20 లక్షల మార్కుకు చేరుకున్నది.
సుజుకి హయబుసా (Suzuki Hayabusa) ఐకానిక్ (Iconic) మోటారు సైకిల్ స్ఫూర్తిగా 2005లో రూపుదిద్దుకున్నదే ఈ స్విఫ్ట్ (Swift) కారు. క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. భారత్ లో అత్యధిక మార్కెట్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా 65 లక్షలకు పైగా అమ్ముడైన స్పోర్టీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్.
ఇవి కూడా చదవండి :
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

