బెంగళూరు, మార్చి 30 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్లోకి నయా అపాచీ మాడల్‌ను తీసుకొచ్చింది. అత్యంత శక్తివంతమైన 160 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ మోటర్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.12 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.1.25 లక్షలు.
మూడు రకాల్లో లభించనున్న ఈ బైకు షోరూం ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. రైడింగ్‌లో నూతన అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నయా బైకులో పలు మార్పులు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.