2024 Maruti Suzuki Dzire | త్వరలో మారుతి డిజైర్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ.. ఆ మూడు కార్లతో పోటాపోటీ..?!
2024 Maruti Suzuki Dzire | దేశీయ కార్ల మార్కెట్ సెడాన్ సెగ్మెంట్ లీడర్ మారుతి డిజైర్ అప్డేటెడ్ వర్షన్‌తో వస్తోంది.
2024 Maruti Suzuki Dzire | దేశీయ కార్ల మార్కెట్ సెడాన్ సెగ్మెంట్ లీడర్ మారుతి డిజైర్ అప్డేటెడ్ వర్షన్‌తో వస్తోంది. 2024 డిజైర్ ఫేస్ లిఫ్ట్ పేరుతో మార్కెట్లో ఆవిష్కరించేందుకు మారుతి సిద్ధమైంది. కొన్నేండ్లుగా సెడాన్ కార్ల విక్రయాల్లో మార్కెట్ వాటా కోల్పోతున్నది మారుతి. ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి మారుతికి గట్టి పోటీ ఎదురవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 1,48,623 యూనిట్లు అమ్ముడైంది. 25 బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి డిజైర్ ఒకటిగా ఉంది. 2024 మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ న్యూ గ్రిల్లె, అప్ డేటెడ్ హెడ్ లైట్స్, అల్లాయ్ వీల్స్, న్యూ టెయిల్ లైట్స్, ట్వీక్డ్ బంపర్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, న్యూ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత కలుపుతారు.
మారుతి డిజైర్ ప్రస్తుతం 1.2 లీటర్ల కే-సిరీస్ డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ 88 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ 76 బీహెచ్పీ, 98 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. పెట్రోల్ మోడ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ, సీఎన్జీ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఈ కారు ఫ్యుయల్ ఎఫిషియెంట్‌గా నిలుస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ లీటర్ పెట్రోల్ పై 22.4 కి.మీ, ఏఎంటీ పెట్రోల్ వేరియంట్ 22.61 కి.మీ, సీఎన్జీ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 31.12 కి.మీ మైలేజీ ఇస్తుంది.
ప్రస్తుతం మారుతి డిజైర్ రూ.6.56 లక్షల నుంచి రూ.9.39 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. ఫేస్ లిఫ్ట్ వర్షన్ కారు స్వల్పంగా ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ ఔరా, టాటా టైగోర్, హోండా అమేజ్ కార్లతో 2024 మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ పోటీ పడుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

