ఇంటి అద్దెపై జీఎస్టీ.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇలా
GST on RentalHome | వ్యక్తిగత అవసరాలకు కాక.. వాణిజ్య అవసరాలకు ఇల్లు అద్దెకు తీసుకున్న వారు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
GST on House rent | ఇతర వస్తువులు, సేవలపై జీఎస్టీ మాదిరిగానే ఇండ్లలో అద్దెకు ఉన్న వారికీ పన్ను షాక్ తగలనున్నది. అంటే, అద్దెకు ఉన్న వారు 18 శాతం జీఎస్టీ చెల్లించాలని తాజా నివేదికలు చెబుతున్నాయి. అలా ఇండ్ల అద్దెలపై జీఎస్టీ చెల్లించిన వారు ప్రతి ఏటా సమర్పించే ఐటీ రిటర్న్స్‌లో మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. గత జూన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. గత నెల 18 నుంచి ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. అలా అమల్లోకి వచ్చిన నిర్ణయాల్లో ఒకటి ఇండ్లపై అద్దెకు జీఎస్టీ. రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం – RCM) కింద ఇండ్లలో అద్దెకు ఉన్న అద్దెదారులు పన్ను చెల్లించాలి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఇండ్లలో అద్దెకు ఉన్న ప్రతి ఒక్కరూ జీఎస్టీ చెల్లించనవసరం లేదని కేంద్రం వివరించింది. మీడియాలో వచ్చిన కథనాలకు అనుగుణంగా జీఎస్టీ నమోదిత వ్యక్తులంతా పన్ను పే చేయాల్సిన అవసరం లేదన్నది. ఇక వ్యక్తిగతంగా కుటుంబ అవసరాల కోసం అద్దెకు ఉండే వారూ జీఎస్టీ చెల్లించ అక్కర్లేదని పేర్కొంది. అంటే వ్యాపారులు, ఏదేనీ సంస్థలో పార్టనర్లుగా ఉన్న వారూ.. కుటుంబ అవసరాలకు ఉండే అద్దె ఇంటిపై జీఎస్టీ వర్తించదు.
వేతన జీవులు కూడా జీఎస్టీ పరిధిలోకి రారని, వారు కూడా ఇంటద్దెపై జీఎస్టీ చెల్లించ అవసరం లేదని పేర్కొంటూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వివరణ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు ఏదైనా ఇంటిని అద్దెకు తీసుకున్న వారు.. అంటే జీఎస్టీలో రిజిస్టర్డ్ వ్యాపారులు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
Claim: 18% GST on house rent for tenants #PibFactCheck
▶️Renting of residential unit taxable only when it is rented to business entity
▶️No GST when it is rented to private person for personal use
▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP— PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

