Equity Mutual Funds | 40 శాతానికి పైగా రిటర్న్స్ అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..!
Equity Mutual Funds | 2024లో సుమారు 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ పెట్టుబడులపై 40 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి.
Equity Mutual Funds | ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, పిల్లల అవసరాల కోసం తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. అలా పొదుపు చేసిన మొత్తం వేర్వేరు పెట్టుబడి, మదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రత్యేకించి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, ఆడపిల్లల పెండ్లిండ్ల కోసం ఈ పెట్టుబడులు కొనసాగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు, బంగారం కొనుగోళ్లు, రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) కింద ప్రతి నెలా క్రమం తప్పకుండా మదుపు చేస్తే గడువు ముగిసే నాటికి మంచి రిటర్న్స్ ఇస్తాయి. 2024లో సుమారు 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ పెట్టుబడులపై 40 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి. 150కి పైగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 20 శాతానికి పైగా రిటర్న్స్ అందించాయి. ఈ ఏడాది కాలంలో ఇన్వెస్టర్లు 268 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులు పెట్టారు.
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్‌లో నాలుగు టాప్ స్కీమ్స్ ఇందులో చోటు దక్కించుకున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 60.78 శాతం, మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 54.72 శాతం రిటర్న్స్ అందించాయి. మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ 49.23 శాతం, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 48.72 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లకు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 46.44 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లో పెట్టుబడులపై 45.99 శాతం రిటర్న్స్ వచ్చాయి.
ఇన్ వెస్కో మ్యూచువల్ ఫండ్ లో మూడు స్కీమ్స్ మంచి రిటర్న్స్ అందించాయి. ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ 45.06 శాతం, ఇన్ వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 42.29, ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ 40.88 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.03 శాతం రిటర్న్స్ అందించింది. మరో 258 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ -0.98 శాతం నుంచి 39.84 శాతం మధ్య రిటర్న్స్ అందించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

